
📌 Key Points
- చిరంజీవి ‘మృగరాజు’ ఫ్లాప్ తర్వాత గుణశేఖర్ కి మహేష్ బాబు బంపర్ ఆఫర్!
- మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమాతో గుణశేఖర్ కి ఇండస్ట్రీ హిట్, 30 కోట్లు వసూళ్లు.
- 14 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఒక్కడు’ సినిమా అప్పట్లో సంచలనం.
- రాజమౌళితో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ, గుణశేఖర్ ‘యుఫోరియా’ మూవీతో రీసెంట్ గా వచ్చారు.
టాలీవుడ్ లో సంచలనం! మహేష్ బాబు ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టడం వెనుక అసలు కథ ఇది. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఎలా సక్సెస్ అయిందో తెలుసుకోండి.
చిరంజీవి సినిమాతో గుణశేఖర్ కి ఫ్లాప్
Mahesh Babu : ఇప్పుడంటే దర్శకులు హిట్స్ కొడితేనే సినిమా ఛాన్సులు ఇస్తున్నారు కొంతమంది హీరోలు. కానీ గతంలో దర్శకుడి ముందు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరోలు కథ నచ్చితే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. అలా మహేష్ బాబు కూడా ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు గుణశేఖర్. మెగాస్టార్ తో గుణశేఖర్ తీసిన మృగరాజు సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ గుణశేఖర్ మీద బాగానే ఎఫెక్ట్ అయింది. కానీ ఆ సమయంలో మహేష్ బాబు గుణశేఖర్ కి ఫోన్ చేసి పిలిపించుకొని సినిమా చేద్దాం అన్నాడు. అప్పటికే గుణశేఖర్ కొన్నేళ్ల క్రితమే మహేష్ కి ఒక కథ చెప్పి ఉన్నాడు.
మహేష్ బాబు పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు
మహేష్ బాబు హీరోగా మొదటి సినిమా ఓపెనింగ్ ఫోటోలను చూసిన డైరెక్టర్ గుణశేఖర్ ఎప్పటికైనా చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో చేయాలని రాసిపెట్టుకున్న కథ గుర్తొచ్చింది. ఆ కథ మహేష్ కి సరిపోతుందనుకొని వెళ్లి చెప్పాడు. గుణశేఖర్ చెప్పిన కథ మహేష్ కి నచ్చింది కానీ అప్పటికే మహేష్ ఒక్క సినిమా కూడా హీరోగా రాలేదు, పైగా లైన్ లో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అని తర్వాత చేద్దాం అని చెప్పాడు మహేష్.
అలా నాలుగేళ్ళ తర్వాత గుణశేఖర్ కి మహేష్ బాబు ఆ కథని గుర్తుంచుకొని కాల్ చేసాడు. అప్పటికే చిరంజీవితో మృగరాజు ఫ్లాప్ ఉన్న మహేష్ అదేమీ పట్టించుకోకుండా అప్పుడు చెప్పిన కథని కంప్లీట్ చేయమన్నాడు. దాంతో గుణశేఖర్ స్క్రిప్ట్ పూర్తి చేసి మహేష్ కి వినిపిస్తే నచ్చేసింది. కానీ చార్మినార్ సెట్, ఇంకా కథకి బడ్జెట్ కూడా పెరిగిపోయింది. మొదట చాలా మంది నిర్మాతలు అనుకున్నా చివరికి MS రాజు ఆ సినిమాని నిర్మించారు. ఒక్కడు సినిమా ఆల్మోస్ట్ 14 కోట్లతో తెరకెక్కించారు. అప్పట్లో అది భారీ బడ్జెట్ సినిమానే.
‘ఒక్కడు’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్
ఆ తర్వాత ఒక్కడు ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. 14 కోట్లతో తెరకెక్కిస్తే అప్పట్లోనే ఈ సినిమా 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మహేష్ ని స్టార్ హీరోని చేసింది. ఆ తర్వాత గుణేశేఖర్ – మహేష్ కాంబోలో వచ్చిన అర్జున్ సినిమా మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి తో వారణాసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. గుణశేఖర్ ఇటీవలే భూమికతో యుఫొరియా సినిమా తీయగా సినిమా బాగున్నా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.
మహేష్ బాబు కెరీర్ లో ఇది ఒక మైలురాయి. గుణశేఖర్ కి ఇచ్చిన ఆ ఒక్క ఛాన్స్ ఇండస్ట్రీ హిట్ అయింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


