|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రియల్ ఎస్టేట్ స్కామ్‌లో మహేశ్ బాబుకు లీగల్ నోటీసులు.. బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే?

Published: 07-07-2025, 2:41 AM
రియల్ ఎస్టేట్ స్కామ్‌లో మహేశ్ బాబుకు లీగల్ నోటీసులు.. బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే?

ప్రముఖ నటుడు మహేశ్ బాబుకు రియల్ ఎస్టేట్ స్కామ్‌కు సంబంధించి లీగల్ నోటీసులు అందాయి. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఈ నోటీసులు జారీ చేసింది. బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన తీసుకున్న మొత్తంపై చర్చ జరుగుతోంది.

Key Points

1

రియల్ ఎస్టేట్ స్కామ్‌లో మహేశ్ బాబు పేరు ప్రస్తావన.

2

రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నుండి లీగల్ నోటీసులు.

4

వినియోగదారుల ఫిర్యాదుతో కేసు నమోదు.

మహేశ్ బాబుకు లీగల్ నోటీసులు

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం లీగల్ నోటీసులు జారీ చేసింది. పలు మీడియా సైట్ల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ ఫిర్యాదుతో మహేశ్ బాబుకు రంగారెడ్డి కన్జ్యూమర్ ఫోరం నోటీసులు పంపించిటన్లు సమాచారం.

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌ సంస్థలు రియల్ ఎస్టేట్ నిర్వహించగా అందులో కుంభకోణం జరిగినట్లు హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతినిధిగా, యజమాని కంచర్ల సతీష్‌ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా పేర్కొన్నారు.

అలాగే, సాయి సూర్య డెవలపర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేశ్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషనల్‌లో ఫిర్యాదు దాఖలు అయింది. కేసు వేసిన డాక్టర్, మరో వ్యక్తి ఇద్దరు రెండో ప్రతివాది అయిన కంచర్ల సతీష్ చంద్రగుప్తా మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరో ప్లాట్ కొనడానికి రూ. 34 లక్షల 80 వేలు చెల్లించారు.

రియల్ ఎస్టేట్ స్కామ్ వివరాలు

ఆ వెంచర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని, మహేశ్ బాబు ఫొటోతో ఉన్న బ్రోచర్‌లో వెంచర్ ప్రత్యేకతలు చూసి ఆకర్షితులయ్యామని, అందుకే డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. ఆ తర్వాత చెప్పిన చోట లేఅవుట్ లేదని తెలుసుకుని డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినట్లు వారు పేర్కొన్నారు.

తమ డబ్బు అడిగితే రెండో ప్రతివాది కంచర్ల సతీష్ చంద్రగుప్తా వాయిదాల పద్ధతిలో అతి కష్టంగా రూ. 15 లక్షలు మాత్రమే ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు వెల్లడించారు. మిగతా డబ్బు విషయంలో ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు వారు తెలిపారు.

బ్రాండ్ అంబాసిడర్ రెమ్యునరేషన్

ఇక ఈ కేసుకు సంబంధించి ఇవాళ సోమవారం (జులై 7) విచారణకు హాజరు కావాలని ప్రతివాదులను ఆదేశించినట్లు నోటీసుల్లో పేర్కొంది కమిషన్. అయితే, ఈ విషయంపై మహేశ్ బాబు కానీ, ఆయన టీమ్ కానీ ఏ విధంగానూ స్పందించలేదు.

ఇదిలా ఉంటే, ఈ ప్రాజెక్ట్‌కు ప్రచార కర్తగా మహేశ్ బాబు ఉన్నందుకు చెక్కు, నగదు రూపంలో మత్తంగా రూ. 5.9 కోట్లు అందుకున్నట్లు డెక్కన్ క్రోనికల్ సహా బాలీవుడ్ మీడియా పేర్కొంది. అయితే, ఈ విషయంలో మహేశ్ బాబును నిందితుడిగా విచారించడం లేదని, ఈ స్కామ్‌లో నటుడి ప్రమేయం ఉండకపోవచ్చని న్యూస్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

మొత్తంమీద, ఈ రియల్ ఎస్టేట్ స్కామ్‌లో మహేశ్ బాబు పాత్రపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విచారణ తర్వాతే నిజానిజాలు బయటపడతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.