|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మహేష్ బాబు కెరీర్ లో మూడు సంచలన తప్పిదాలు! ఫ్యాన్స్ దిమ్మతిరిగే నిజాలు!

Published: 22-02-2026, 12:05 AM
షాకింగ్: మహేష్ బాబు కెరీర్ లో మూడు సంచలన తప్పిదాలు! ఫ్యాన్స్ దిమ్మతిరిగే నిజాలు!
  • మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్: ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాలను వదులుకున్న సూపర్ స్టార్!
  • `గజిని` సినిమా అవకాశం మిస్ చేసుకున్న మహేష్.. సూర్య కెరీర్ టర్నింగ్ పాయింట్!
  • సుకుమార్, మహేష్ బాబు కాంబోలో `పుష్ప` మూవీ మిస్.. బన్నీకి గోల్డెన్ ఛాన్స్!
  • సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `యానిమల్` మూవీ రిజెక్ట్ చేసిన మహేష్.. రణ్‌బీర్‌కు బ్లాక్ బస్టర్ హిట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరోల కెరీర్ ను మార్చేశాయి. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందామా?

మహేష్ మిస్ చేసుకున్న `గజిని`.. సూర్యకు సూపర్ హిట్!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇప్పటి వరకు ఒక్క పాన్‌ ఇండియా మూవీ కూడా చేయలేదు. కానీ క్రేజ్‌ మాత్రం వేరే లెవల్‌. ఆయన ఫాలోయింగ్‌ ఇప్పుడున్న హీరోలతో పోల్చితే టాప్‌లోనే ఉంటుందని చెప్పొచ్చు. లేట్‌ అయినా లేటెస్ట్ గా వస్తున్నారు మహేష్‌. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు, ఏకంగా గ్లోబల్‌ ఫిల్మ్ తో రాబోతున్నారు.

అయితే మహేష్‌ బాబు ఇప్పటికే పాన్‌ ఇండియా హీరో కావాల్సింది. కానీ కాలేకపోయారు. దానికి కారణం కూడా ఆయనే. కొన్ని ప్రాజెక్ట్ లను రిజెక్ట్ చేశారు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారు. ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన చిత్రాలకు మహేష్‌ నో చెప్పారు. మరి ఆ సినిమాలేంటనేది చూస్తే,

`పుష్ప` కథ రిజెక్ట్ చేసిన మహేష్.. బన్నీకి జాక్ పాట్!

మహేష్‌ తన కెరీర్‌లో చాలా సినిమాలను రిజెక్ట్ చేశారు. కానీ అయ్యో మిస్‌ చేసుకున్నారే అనిపించిన మొదటి మూవీ `గజిని`. సూర్య, ఆసిన్‌ నటించిన చిత్రమిది. కోలీవుడ్‌ని షేక్‌ చేసింది. అప్పట్లో ఇది పాన్‌ ఇండియా రేంజ్‌ ఫిల్మ్. దీన్ని హిందీలో అమీర్‌ ఖాన్‌ రీమేక్‌ చేసి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఈ మూవీ స్టోరీని దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ మొదట మహేష్‌ బాబుకే చెప్పారట. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. దీంతో సూర్య చేశారు. సూపర్‌స్టార్‌ అయిపోయారు.

ఆ తర్వాత మహేష్‌ వదులుకున్న మరో మూవీ `పుష్ప`. దర్శకుడు సుకుమార్‌ మొదట ఈ కథని మహేష్‌ బాబుకే చెప్పారు. కానీ మరీ ఊరమాస్‌గా ఉందని చెప్పి,  పాత్రలో కొన్ని మార్పులు చేయాలని మహేష్‌ అడిగారట. కానీ సుకుమార్‌ చేయలేదు. దీంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్‌ అయ్యింది. ఈ సినిమాని అల్లు అర్జున్‌ చేశాడు. తన లైఫే మారిపోయింది. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. ప్రభాస్‌కి పోటీగా నిలిచారు. `పుష్ప` పెద్ద హిట్‌ అయితే , `పుష్ప 2` ఇండియన్‌ సినిమాని ఊపేసిన విషయం తెలిసిందే. ఇది మహేష్‌ కెరీర్‌లో చేసిన కాస్ట్లీ మిస్టేక్‌గా చెప్పొచ్చు.

`యానిమల్` మూవీకి నో చెప్పిన మహేష్ బాబు.. రణ్‌బీర్‌కు బిగ్ బ్రేక్!

మహేష్‌ బాబు చేసిన మరో మిస్టేక్‌.. `యానిమల్‌` మూవీకి నో చెప్పడం. సందీప్‌ రెడ్డి వంగా ఈ కథని మొదట మహేష్‌ బాబుకే చెప్పారట. దీంతో రణ్‌ బీర్‌ కపూర్‌కి వెళ్లింది. రణ్‌ బీర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్‌ని ఊపేసింది. ట్రెండ్‌ బ్రేకర్‌గా నిలిచింది. సినిమా మేకింగ్‌ పరంగానూ లెక్కలను మార్చేసింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ విశ్వరూపం చూపించారు. సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రణ్‌బీర్‌ కపూర్‌ లైఫ్‌నే మార్చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీని మహేష్‌ బాబు రిజెక్ట్ చేయడం కూడా ఆయన చేసిన బిగ్‌ మిస్టేక్‌గా అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు భావిస్తుంటాయి.

ఇదిలా ఉంటే ఇవన్నీ ఊరమాస్‌, రా అండ్‌ రస్టిక్‌ చిత్రాలు. ఆయా హీరోలు చేశాక, ఇవి మహేష్‌ కి సెట్‌ అవుతాయా? అనే డౌట్‌ కూడా వస్తుంది. ఆయన స్టయిల్‌కి, బాడీలాంగ్వేజ్‌కి ఇవి అంతగా సెట్‌ కావనే భావన కలుగుతుంది. కానీ చేస్తేగానీ వాటి ఫలితాలను చెప్పలేం. ఒకేవేళ కరెక్ట్ గా సెట్‌ అయితే ఇండస్ట్రీ షేక్‌ అయ్యేదని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న `వారణాసి` మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రకాష్‌ రాజ్‌ వంటి వారు నటిస్తున్నారు. సుదీప్‌ కూడా కనిపిస్తారనే టాక్‌ ఉంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

మహేష్ బాబు మిస్ చేసుకున్న ఈ సినిమాలు వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.