|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మహేష్ బాబు మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవేనా? ఊహించని నిజాలు!

Published: 02-03-2026, 11:35 AM
షాకింగ్: మహేష్ బాబు మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవేనా? ఊహించని నిజాలు!
  • మహేష్ బాబు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్ మిస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
  • సూర్య నటించిన గజిని సినిమా మొదట మహేష్ బాబుకు వినిపించారట.
  • సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో మహేష్ నటించాల్సింది ఉంది.
  • సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ కూడా మహేష్ వదులుకున్నాడని టాక్.

మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ, కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు. ఆయన కెరీర్ లో మిస్ చేసుకున్న సినిమాలు, వాటి ప్రభావం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మహేష్ బాబు మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్స్

Mahesh Babu: టాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు తన కెరీర్‌లో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చారు. కథ ఎంపిక విషయంలో.. తన ఇమేజ్‌కు తగ్గ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన హీరోగా ఆయనకు పేరు ఉంది. అయితే..ఇలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొన్ని పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాలను మాత్రం మహేష్ బాబు వదులుకున్నారు. అంతేకాదు అందువల్లే మహేష్ బాబుకి పాన్ ఇండియా స్టేటస్ రావడానికి ఇంత లేట్ అయింది అన్న వాదన కూడా వినిపిస్తూ వస్తోంది.

హీరోల దగ్గరకు ఎన్నో కథలు వస్తుంటాయి. కొన్నిసార్లు కథ నచ్చక..మరికొన్నిసార్లు డేట్స్ కుదరక, ఇంకొన్ని సార్లు తమ ఇమేజ్‌కు సరిపోదని భావించి సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. మహేష్ బాబు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన తిరస్కరించిన కొన్ని సినిమాలు…ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించాయి.

అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది సూర్య సూపర్ హిట్ సినిమా గజిని. ఈ సినిమాను దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ మొదట మహేష్ బాబుకే వినిపించారనే టాక్ ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమాను చేయలేదు. ఆ తర్వాత ఈ సినిమా సూర్యతో తెరకెక్కి..సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సూర్య కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాతో సూర్యకి ప్రపంచ స్థాయికి గుర్తింపు వచ్చింది.

పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడానికి కారణం?

ఇక మరో ముఖ్యమైన సినిమా పుష్ప. దర్శకుడు సుకుమార్ మొదట ఈ కథను మహేష్ బాబు కోసం సిద్ధం చేశారని చాలాకాలం టాక్ నడిచింది. కానీ ఆ పాత్ర తనకు సూట్ కాదని భావించిన మహేష్ ఈ ప్రాజెక్ట్‌కు దూరమయ్యారంట. ఆ తర్వాత ఈ సినిమాతో.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారారు.

అలాగే యానిమల్ కూడా మహేష్ బాబు వదులుకున్న సినిమా అని ప్రచారం జరిగింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కథ వినిపించినా.. ఫ్యామిలీ ఇమేజ్ దెబ్బతింటుందనే ఆలోచనతో మహేష్ వెనకడుగు వేశారట. ఆ తర్వాత ఈ సినిమా రణబీర్ కపూర్తో తెరకెక్కి భారీ విజయం సాధించింది.

రాజమౌళితో మహేష్ బాబు పాన్ ఇండియా ఎంట్రీ

మహేష్ బాబు తన బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవడానికే.. ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకనే కొన్ని సినిమాలు ఒప్పుకోలేదు. దీనివల్ల ఆయనకు పాన్ ఇండియా సూపర్ హిట్ రావడానికి కూడా ఆలస్యమైంది. అయితే ఇప్పుడు ఎస్.ఎస్. రాజమౌళితో చేస్తున్న సినిమా ద్వారా ఆయన పాన్ ఇండియా స్థాయిలోకి అడుగుపెట్టనున్నారు. ఇకపై అయినా మహేష్ బాబు కొత్త తరహా పాత్రలు, భిన్నమైన కథలు ఎంచుకుంటే అభిమానులకు మరింత కొత్త అనుభూతి ఇస్తారన్న.. అభిప్రాయం చాలా మందిలో ఉంది.

మహేష్ బాబు తన ఇమేజ్ కాపాడుకోవడానికి కొన్ని సినిమాలను వదులుకున్నారు. రాజమౌళితో సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని చూస్తున్నారు. కొత్త తరహా పాత్రలతో అలరించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.