|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

21 ఏళ్ల ప్రేమ ప్రయాణం! మహేష్, నమ్రతల వెడ్డింగ్ యానివర్సరీ.. నమ్రత హృదయ స్పందన!

Published: 10-02-2026, 8:05 AM
21 ఏళ్ల ప్రేమ ప్రయాణం! మహేష్, నమ్రతల వెడ్డింగ్ యానివర్సరీ.. నమ్రత హృదయ స్పందన!
  • మహేష్ బాబు, నమ్రతల 21వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నమ్రత ఎమోషనల్ పోస్ట్ చేశారు.
  • విమానంలో దిగినప్పటి ఫోటోను షేర్ చేస్తూ నమ్రత తన ప్రేమను వ్యక్తపరిచారు.
  • పెళ్లి తర్వాత నమ్రత తన సినీ కెరీర్‌ను వదులుకొని కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చారు.
  • మహేష్, నమ్రత దాంపత్య జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ 21వ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకున్నారు. ఈ సందర్భంగా నమ్రత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. వారి అనుబంధం గురించి తెలుసుకుందాం.

నమ్రత ఎమోషనల్ పోస్ట్ వైరల్

Mahesh Babu -Namrata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తన టాలెంట్ తో ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar )ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా వీరి వివాహం జరిగి 21 సంవత్సరాలు అయిన నేపథ్యంలో నమ్రత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. నమ్రత మహేష్ బాబుతో కలిసి దిగిన ఒక ఫోటో షేర్ చేశారు ఈ ఫోటో చూస్తుంటే చాలాకాలం క్రితం ఫోటో అని స్పష్టమవుతుంది.

ఇలా విమానంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..” ఇప్పటికి ప్రతిరోజు నేను నిన్ను ఎంపిక చేసుకుంటున్నాను హ్యాపీ 21 MB” అంటూ లవ్ ఎమోజిని ఈమె షేర్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా నమ్రత చేసిన ఈ పోస్ట్ పై పలువురు సెలబ్రిటీలు, అభిమానులు స్పందిస్తూ ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలకు ఇష్టం లేకపోయినా చాలా సింపుల్ గా వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే.

ప్రేమ వివాహం.. ఆదర్శ దంపతులు

నమ్రత కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓవెలుగు వెలిగారు . అయితే ఈమె మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత తనకెంతో ఇష్టమైన సినిమాలను కూడా పక్కనపెట్టి కేవలం తన పిల్లలు కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు. ప్రస్తుతం పలు వ్యాపారాలను చూసుకుంటూ నమ్రత ఎంతో బిజీగా గడుపుతున్నారు. 21 సంవత్సరాల కాలంలో ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

ఫ్యామిలీ కోసం కెరీర్ త్యాగం

ఇటీవల కాలంలో పెళ్లైన కొద్ది రోజులకి విడాకులు తీసుకుని విడిపోతున్నారు . ఇక మహేష్ బాబు నమ్రత ఇద్దరు స్టార్ సెలెబ్రెటీలు అయినప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇక ఈ దంపతులకు గౌతమ్, సితార అనే పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోవడమే కాకుండా, అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. 2027 ఏప్రిల్ 7 వ తేదీ ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

మొత్తానికి మహేష్ బాబు, నమ్రతల అన్యోన్య దాంపత్య జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. వారి బంధం ఇలాగే కలకాలం నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.