|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్ బాబుకి ఊహించని షాక్: బ్లాక్ బస్టర్ సినిమాని డిజాస్టర్ చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

Published: 09-03-2026, 1:05 AM
మహేష్ బాబుకి ఊహించని షాక్: బ్లాక్ బస్టర్ సినిమాని డిజాస్టర్ చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
  • మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన ‘1 నేనొక్కడినే’ మూవీ!
  • సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
  • కృతి సనన్ హీరోయిన్‌గా, గౌతమ్ బాలనటుడిగా పరిచయం అయ్యారు.
  • సినిమాలోని ఎమోషనల్ యాంగిల్ ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదని సుకుమార్ వెల్లడి.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో హిట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. ఐతే ఒక సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా డిజాస్టర్ అయింది. ఆ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ కెరీర్‌లో మరపురాని రోజులు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీన్ని ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. `బాహుబలి`తో తెలుగు సినిమాని ఇండియాకి ఫేస్‌ ఆఫ్‌గా మార్చేసిన ఆయన ఇప్పుడు భారతీయ సినిమాని అంతర్జాతీయంగా ఫేస్‌ ఆఫ్‌గా మార్చబోతున్నారు. అందులోనూ తెలుగు సినిమాని గ్లోబల్‌ మార్కెట్‌కి పరిచయం చేయబోతున్నారు. అందుకు మహేష్‌ సైతం ఎంతో క్రమశిక్షణతో, కఠినమైన ప్రాక్టీస్‌తో ఎంతో కష్టపడి ఈ మూవీ చేస్తున్నారు. పూర్తిగా ఆయన రాజమౌళి కి సరెండరై షూటింగ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మహేష్‌ కెరీర్‌లో హిట్లతోపాటు పరాజయాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే 2014లో మాత్రం మర్చిపోలేని డిజాస్టర్లు పడ్డాయి. ఆ ఏడాది `వన్‌ నేనొక్కడినే`, `ఆగడు` వంటి ఫ్లాప్‌లు బ్యాక్‌ టూ బ్యాక్‌ పడ్డాయి. ఓ రకంగా ఆ ఏడాది మహేష్‌ కి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అయితే ఇందులో ఓ మూవీ హిట్‌ కావాల్సింది. సరిగ్గా చేస్తే బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన మూవీ. కానీ డిజాస్టర్‌ అయిపోయింది. దర్శకుడు చేసిన మిస్టేక్‌ కారణంగా పరాజయం చెందింది. అదొక పీడకలగా మారింది.

‘1 నేనొక్కడినే’ మూవీ వెనుక అసలు నిజాలు

ఆ సినిమా `1 నేనొక్కడినే`. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కృతి సనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతోనే ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇందులో మహేష్‌ బాబు కొడుకు గౌతమ్‌ కూడా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా  రూపొందిన ఈ మూవీని 14 రీల్స్ పై తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా 2014 జనవరి 14న విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో బోల్తా పడింది. మహేష్‌ అభిమానులను పూర్తిగా డిజప్పాయింట్‌ చేసింది. సినిమాని ప్రొజెక్ట్ చేసింది వేరు, కానీ మూవీలో ఉన్న కంటెంట్‌ వేరు. అది ఆడియెన్స్ కి అర్థం కాలేదు. దీంతో డిజాస్టర్‌గా మారిపోయింది.

ఈ సినిమా ఫెయిల్యూర్‌లో అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సుకుమార్‌ స్పందించారు. హిట్‌ కావాల్సిన మూవీ అది అని, కానీ తన వల్లే ఫ్లాప్‌ అయ్యిందని ఒప్పుకున్నారు. దానికి కారణం కూడా ఆయన వెల్లడించారు. సినిమాలో చూపించిన వెర్షన్‌తోపాటు మరో వెర్షన్‌ కూడా తన వద్ద ఉందట. ఇది ఎమోషనల్‌గా వర్కౌట్‌ అవుతుందని ఆయన భావించారట. కానీ మరో వెర్షన్‌ కూడా ఉందని, ఇది దానికంటే బెటర్‌గా ఉందని, హీరోయిజం పెరిగేదని, అప్పుడు ఆడియెన్స్ కి బాగా ఎక్కేదని, కానీ తాను ఎక్కడో ఈ ఎమోషనల్‌ యాంగిల్‌ వర్కౌట్‌ అవుతుందని భావించి ఇదే చేశానని, కానీ మరో వెర్షన్‌ కూడా షూట్‌ చేసి మిక్స్ చేసి చూస్తే బాగుండేది, అది చేసే నిజంగానే సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయ్యేదని తెలిపారు సుకుమార్‌.

సుకుమార్ ఏం చెప్పారంటే?

`నాకు ఎందుకో హిట్‌ చేయాల్సిన సినిమా(1 నేనొక్కడినే) ని ఫ్లాప్‌ చేశానేమో అనిపిస్తుంది. నా చేతుల్లో ఉండి కూడా, నిర్మాతలు నాకు చాలా టైమ్‌ ఇచ్చారు, రిలీజ్‌ అర్జెంట్‌ లేదు. మరో వెర్షన్‌లో హీరో తనకు సమస్య లేకపోయినా, ఆ డ్రామా ప్లే చేస్తున్నాడని చూపించే వెర్షన్‌ ఉంది. ఎక్కడో నేను ఎమోషనల్‌ సైడ్‌ వెళ్లిపోయాను. హీరోకి సమస్య లేదంటే ఎమోషన్స్ మిస్‌ అవుతుందని అనుకున్నా, కానీ దానివల్ల హీరోయిజం ఇంకా బాగా పెరిగేది. ఆ వెర్షన్‌ చెప్పినప్పుడు నిర్మాత రామ్‌ నన్ను కొడుతూనే ఉన్నారు(ఇదెలా మిస్‌ అయ్యావని). ఆయా సీన్లు కూడా షూట్‌ చేసి, ఎడిట్‌ టేబుల్ మీద చూసుకొని ఉంటే బాగుండేది` అని వెల్లడించారు సుకుమార్‌. చాలా రోజుల క్రితం చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్నాయి.

`1 నేనొక్కడినే` తర్వాత ఎన్టీఆర్‌తో `నాన్నకు ప్రేమతో` మూవీ చేశారు సుకుమార్‌. ఇది బాగానే ఆడింది. ఎన్టీఆర్‌ని పూర్తిగా కొత్తగా చూపించిన చిత్రమిది. `రంగస్థలం`, `పుష్ప`, `పుష్ప 2` చిత్రాలు రూపొందించారు. ఇండియన్‌ సినిమాని రూల్‌ చేసే దర్శకుడిగా మారిపోయారు. ఇప్పుడు ఆయన రామ్‌ చరణ్‌తో సినిమాకి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

మహేష్ బాబు సినిమా గురించి ఈ షాకింగ్ అప్‌డేట్స్ మీకు ఎలా అనిపించాయి? మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.