
📌 Key Points
- హాలీవుడ్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు!
- ‘పోకిరి’ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది: మహేష్
- రాజమౌళితో వారణాసి సినిమాతో హాలీవుడ్‌లో మహేష్ బాబు!
- పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సంచలన విజయం సాధించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఒక సంచలన వార్త! ఆయన తన కెరీర్ లోని మైలురాయి అయిన ‘పోకిరి’ సినిమా గురించి హాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
హాలీవుడ్‌లో మహేష్ బాబు ఇంటర్వ్యూ వైరల్!
Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టార్గెట్ గా పెట్టుకొని భారీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ రేంజ్ హాలీవుడ్ స్థాయికి వెళ్లడం గ్యారెంటీ. రాజమౌళి హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇటీవల వారణాసి గ్లింప్స్ రిలీజయిన సమయంలో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాలీవుడ్ లో స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు.(Mahesh Babu)
తాజాగా హాలీవుడ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ రిలీజవ్వగా ఇందులో మహేష్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో పోకిరి సినిమా గురించి మాట్లాడటం విశేషం. మహేష్ కెరీర్లో పోకిరి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే ఆల్మోస్ట్ 75 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మహేష్ కి సూపర్ స్టార్ గా మరింత స్టార్ డమ్ పెరిగింది.
‘పోకిరి’ సినిమా గురించి మహేష్ ఏమన్నారంటే?
హాలీవుడ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి ముందు మీ లైఫ్ ని మార్చిన సినిమా ఏది అని అడగ్గా మహేష్ బాబు సమాధానమిస్తూ.. నేను కేవలం 29 సినిమాలు మాత్రమే చేశాను. కానీ 25 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాను. నా కెరీర్ లో పోకిరి సినిమా నన్ను స్టార్ గా చేసింది. అది నన్ను చాలా మార్చింది. 2006లో పోకిరి సినిమా రిలీజయింది. అక్కడ అది చాలా పెద్ద హిట్ అయింది.
రాజమౌళి సినిమాతో హాలీవుడ్‌లో మహేష్ ప్రభంజనం!
ఆ సినిమా తర్వాత ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ ఏరపడింది నాకు. ఆ సినిమా తర్వాత ఆడియన్స్ అంచనాలు పెరిగిపోయాయి. అందుకే అంత పెద్ద హిట్ తర్వాత కన్ఫ్యూజన్ లో పడ్డాను. ప్రతి సినిమా మనిషిగా నన్ను ఎంతో కొంత మార్చింది అని తెలిపారు. దీంతో హాలీవుడ్ లో పోకిరి సినిమా గురించి చెప్పడం గ్రేట్ అంటూ మహేష్ ఫ్యాన్స్, పూరి ఫ్యాన్స్ మహేష్ ని పొగిడేస్తున్నారు.
మహేష్ బాబు హాలీవుడ్ లో పోకిరి సినిమా గురించి మాట్లాడటం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమాతో మహేష్ హాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


