
సుమంత్ మరియు కాజల్ నటించిన ‘అనగనగా’ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ETV విన్ లో విడుదలైన ఈ చిత్రం సానుకూల స్పందనలు అందుకుంది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Key Points
సుమంత్, కాజల్ నటించిన 'అనగనగా' సినిమాకు మహేష్ బాబు ప్రశంసలు.
ETV విన్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది.
పిల్లల చదువు, పెంపకం వంటి సున్నితమైన అంశాలను చూపించింది.
మహేష్ బాబు ట్వీట్ వైరల్ అవుతూ నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
‘అనగనగా’ సినిమాకు మహేష్ బాబు ప్రశంసలు
టాలీవుడ్ స్టార్ హీరో సుమంత్(Sumanth), కాజల్ చౌదరి(Kajal Chowdary) జంటగా నటించిన సినిమా ‘అనగనగా’(Anaganaga). సన్నీ సంజయ్(Sunny Sanjay) తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేష్ రాసకొండ, P.V.S రవి, కముడి నేమాని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి ETV విన్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా పిల్లల చదువు, పెంపకం, తల్లిదండ్రుల బాధ్యత వంటి సున్నితమైన అంశాలను చాలా చక్కగా తెరపై చూపించిందని పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూడా ఈ మూవీను చూసి ఎక్స్ వేదికగా ట్వీట్ పెడుతూ ప్రశంసలు కురిపించాడు. ‘అనగనగా చిత్రం ఒక అద్భుతమైన, మనసును హత్తుకునే కథ. ఈ సినిమా మీ సమయాన్ని వెచ్చించడానికి పూర్తిగా అర్హమైనది! సుమంత్, చిత్ర బృందం అందరూ చాలా గొప్ప పని చేశారు. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు చిత్రయూనిట్‌కి నా శుభాకాంక్షలు’ అంటూ మహేష్ బాబు రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది మీకు ఇప్పుడు తెల్లారిందా అని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం వాళ్ల బిజీ షెడ్యూల్‌లో సినిమా చూసి రివ్యూ ఇవ్వడం చాలా గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. Link
నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు
సినిమా విజయం & సామాజిక అంశాలు
మహేష్ బాబు ప్రశంసలతో ‘అనగనగా’ సినిమా మరోసారి చర్చనీయాంశమైంది. నెటిజన్ల స్పందనలు సినిమా ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి.


