|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ వంశంలో 63వ తరం వీరుడిగా మహేష్.. రాజమౌళి మూవీ టైటిల్ లీక్, స్టోరీ కూడా వైరల్ ?

Published: 10-08-2025, 1:45 AM
ఆ వంశంలో 63వ తరం వీరుడిగా మహేష్.. రాజమౌళి మూవీ టైటిల్ లీక్, స్టోరీ కూడా వైరల్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న SSMB 29 చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. చిత్రం యొక్క టైటిల్, కథ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

మహేష్ బాబు రాజమౌళి చిత్రం SSMB 29 గ్లోబల్ స్థాయిలో విడుదల కానుంది.

2

చిత్రం యొక్క ప్రీ-లుక్ రిలీజ్ అయి వైరల్ గా మారింది.

4

మహేష్ 63వ తరం వీరుడిగా నటిస్తున్నారని, కథ రామాయణానికి సంబంధించి ఉండవచ్చని అంచనాలు.

SSMB 29: గ్లోబల్ స్థాయి చిత్రం

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం SSMB 29(వర్కింగ్ టైటిల్). ఇది గ్లోబ్ ట్రోట్టర్ మూవీ అని రాజమౌళి కన్ఫర్మ్ చేశారు. అంటే ప్రపంచాన్ని మొత్తం తిరిగే వీరుడు అనే అర్థం వస్తుంది. రాజమౌళి ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయాలు బయటపెట్టలేదు. శనివారం రోజు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ముఖం కనిపించకుండా ప్రీ లుక్ రిలీజ్ చేసి ఫస్ట్ రివీల్ నవంబర్ లో ఉంటుంది అని ప్రకటించారు.

మహేష్ బాబు ప్రీ లుక్ క్షణాల్లో వైరల్ గా మారింది. గుండెలపై రక్తం కారుతూ, మెడలో రుద్రాక్ష మాల.. మహా శివుడికి సంబంధించిన త్రిశూలం, నంది ఉన్న ప్రీ లుక్ అందరినీ ఆకర్షించింది. అంటే ఈ చిత్రంలో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయని రాజమౌళి చెప్పకనే చెప్పారు. ప్రీ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్ర కథ, టైటిల్ గురించి ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి.

వైరల్ అయిన మహేష్ బాబు ప్రీ-లుక్

రాజమౌళి అండ్ టీం ఈ చిత్రానికి ‘జెన్ 63’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. వినగానే హాలీవుడ్ స్టైల్ లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి టైటిల్ పెట్టడానికి కారణం కథ ఆ విధంగా ఉంటుందని అంటున్నారు. జెన్ 63 అంటే 63వ జనరేషన్. ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక కీలకమైన వంశంలో 63వ తరం వీరుడిగా కనిపిస్తారట. ఈ చిత్ర కథలో, మహేష్ బాబు పాత్రలో హిందూ పురాణాలకి సంబంధించిన అంశాలు ఉంటాయని అంటున్నారు.

63వ తరం అంటే ఆ వంశం ప్రారంభమై వేల ఏళ్ళు గడచి ఉంటుంది. ఆ విధంగా త్రేతా యుగం లేదా ద్వాపర యుగాలతో రాజమౌళి ఈ కథని కనెక్ట్ చేయబోతున్నారా అనేది క్లారిటీ లేదు. అందుతున్న సమాచారం మేరకు ఈ కథకి రామాయణానికి లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. రామాయణంలో ఉండే కొన్ని పవర్ ఫుల్ వస్తువుల కోసం సాగే అన్వేషణగా ఈ కథ ఉంటుందని అంటున్నారు. ఈ కథలో కాశీ నగరానికి ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది.

‘జెన్ 63’ టైటిల్, కథ వివరాలు

మొత్తంగా మహేష్, రాజమౌళి చిత్రానికి సంబంధించిన విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ రివీల్ తో ఈ చిత్రంపై అందరికీ ఓ క్లారిటీ వస్తుందని రాజమౌళి ప్రకటించారు. మునుపెన్నడూ చూడని విధంగా ఆ రివీల్ ఉండబోతోందట.

మహేష్ బాబు మరియు రాజమౌళి చిత్రం SSMB 29 గురించిన రహస్యాలు నవంబర్‌లో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.