|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేశ్ బాబు, రాజమౌళి ‘వారణాసి’ నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్.. వైరల్!

Published: 17-04-2026, 8:05 AM
మహేశ్ బాబు, రాజమౌళి 'వారణాసి' నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్.. వైరల్!
  • రాజమౌళి, మహేశ్ బాబు కాంబో మూవీపై అంచనాలు భారీగా!
  • హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘వారణాసి’ మూవీ టీమ్!
  • ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా.. 2027 సమ్మర్‌లో విడుదల!
  • జూన్‌లో మళ్లీ షూటింగ్ రీస్టార్ట్.. ఆగస్టు వరకు పూర్తి చేసేలా ప్లాన్!

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ మూవీ గురించి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ పూర్తి!

సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టులలో ‘వారణాసి’ ఒకటి. రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆ ప్రభావాన్ని ఏమాత్రం పట్టించుకోని రాజమౌళి తన క్వాలిటీపై నమ్మకంతో ముందుకు దూసుకుపోతున్నాడు.

ఈ క్రమంలోనే నెక్ట్స్ షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా కీలక షెడ్యూల్ గత నెల నుంచి కొనసాగుతోంది. లీడ్ సీన్స్ పూర్తయ్యాక, ప్రస్తుతం స్పెషల్ సెట్‌లో సాంగ్ షూట్ చేస్తున్నారని తెలుస్తుండగా, మే నెల మొత్తానికి సమ్మర్ బ్రేక్ ఇచ్చి మళ్లీ జూన్‌లో షూట్ రీస్టార్ట్ చేసి ఆగస్టు వరకు కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. కాగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, 2027 సమ్మర్ టార్గెట్‌గా ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి.

సమ్మర్ బ్రేక్ తర్వాత షూటింగ్ రీస్టార్ట్!

2027 సమ్మర్‌లో వరల్డ్ వైడ్ రిలీజ్!

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ఈ భారీ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.