
📌 Key Points
- మహేష్ బాబు చేతుల మీదుగా ఘట్టమనేని జయకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
- RX 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ!
- బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 2026లో విడుదల కానుంది.
- చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం!
టాలీవుడ్ లో మరో సంచలనం! ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వారసుడు వస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
బాబాయ్ చేతుల మీదుగా అబ్బాయ్ గ్రాండ్ ఎంట్రీ!
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అన్న రమేష్ బాబు(Ramesh Babu) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram). ఈ క్రేజీ ప్రాజెక్టును RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని(Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ సినిమా!
లవ్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్(P.Kiran) నిర్మిస్తుండగా.. అశ్వనీదత్(Ashwin dutt) సమర్పిస్తున్నాడు. జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందిస్తున్నాడు. అయితే జనవరి 10వ తేదీ ఉదయం 10:30 గంటలకు హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానున్నట్లు నిన్న మూవీ టీమ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
2026లో ‘శ్రీనివాస మంగాపురం’ విడుదల!
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేయించనున్నట్లు హీరో జయకృష్ణ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ‘ఒక కల్ట్ లవ్ టేల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే ప్రారంభం.. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రేపు ఉదయం 10:30 గంటలకు శ్రీనివాస మంగాపురం ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించనున్నారు.. 2026లో అతిపెద్ద అరంగేట్రం కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ రాసుకొస్తూ తన బాబాయ్ ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొత్తానికి ఘట్టమనేని వారిసుడు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మహేష్ బాబు సపోర్ట్ తో జయకృష్ణ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


