
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. అయితే ఆయన చేసిన కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ కథనంలో, మహేష్ బాబు కెరీర్‌లో వైవిధ్యభరితమైన ప్రయత్నాలుగా నిలిచి, బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన ఐదు చిత్రాలను పరిశీలిద్దాం.
Key Points
మహేష్ బాబు ప్రయోగాత్మక చిత్రాలు తరచుగా నెగటివ్ ఫలితాలనిచ్చాయి.
టక్కరి దొంగ, మహేష్ ఏకైక కౌబాయ్ చిత్రం, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన నాని, తేజ దర్శకత్వంలో నిజం తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు.
1 నేనొక్కడినే, స్పైడర్ చిత్రాలు కొత్త ప్రయత్నాలైనప్పటికీ కమర్షియల్‌గా డిజాస్టర్ అయ్యాయి.
మహేష్ బాబు ప్రయోగాత్మక చిత్రాలు
సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ చిత్రంతో ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రయోగాలు చేసేందుకు మహేష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ మహేష్ కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారీ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. కొత్తగా ప్రయత్నించడం వల్ల మహేష్ బాబుకి ఎదురైన ఫ్లాప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
మహేష్ బాబు నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం టక్కరి దొంగ. 2002 లోనే అత్యంత భారీ బడ్జెట్ లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఈ మూవీ లో మహేష్ చేసిన రియల్ స్టంట్స్, సాహసాలు ఆకట్టుకుంటున్నాయి.
నిరాశపరిచిన విభిన్న కథాంశాలు
చిన్న పిల్లాడు పెద్దవాడిగా మారిపోయే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు. మహేష్ కెరీర్ లో ఇది మరిచిపోదగ్గ చిత్రాల్లో ఒకటి.
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నిజం మూవీ సందేశాత్మక చిత్రంగా రూపొందింది. అవినీతి, లంచంకి వ్యతిరేకంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఒక్కడు లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి చిత్రంలో మహేష్ ని ఫ్యాన్స్ ఊహించుకోలేకపోయారు. ఫలితంగా నిజం మూవీ డిజాస్టర్ అయింది.
ఫ్లాప్ చిత్రాలపై ఒక విశ్లేషణ
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన జెన్యూన్ అటెంప్ట్ ఇది. తన తల్లిదండ్రులని గుర్తు చేసుకుంటూ మానసిక సంఘర్షణకి గురయ్యే హీరో కథ ఈ చిత్రం. సుకుమార్ స్టైలిష్ మేకింగ్ ఆకట్టుకుంది కానీ.. కమర్షియల్ డిజాస్టర్ అయింది.
సైకో విలన్ తో హీరో పోరాడే కథగా ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీలో కొన్ని అంశాలు సరిగ్గా కుదర్లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేడా కొట్టింది. ఫలితంగా మహేష్ కెరీర్ లో భారీ నష్టాలని మిగిల్చిన చిత్రంగా స్పైడర్ నిలిచింది.
మహేష్ బాబు ప్రయోగాత్మక చిత్రాలు కొన్నిసార్లు చేదు ఫలితాలనిచ్చినప్పటికీ, ఆయన కొత్తదనాన్ని కోరుకోవడం మానలేదు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో గ్లోబ్ ట్రాటర్ చిత్రంతో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.


