|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు కొడుకు! వారణాసిలో గౌతమ్ ఘట్టమనేని మాస్ ఎంట్రీ!!

Published: 18-04-2026, 4:35 AM
షాకింగ్: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు కొడుకు! వారణాసిలో గౌతమ్ ఘట్టమనేని మాస్ ఎంట్రీ!!
  • రాజమౌళి వారణాసి మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని నటించనున్నట్లు తాజా సమాచారం!
  • గౌతమ్ గతంలో ‘వన్ నేనొక్కడినే’ చిత్రంలో నటించాడు, ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.
  • ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం ఉండబోతున్నట్లు సమాచారం.
  • 1500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ ను మించి ఉంటుందని అంచనాలున్నాయి.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని కూడా నటించబోతున్నాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

వారణాసిలో గౌతమ్ ఘట్టమనేని?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీ వారణాసితో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబును సూపర్ హీరోగా చూపించబోతున్నాడు. అందుకు తగ్గట్టు మహేష్ బాబు కూడా తన లుక్ ను, ఫిట్ నెస్ ను పెంచుకున్నాడు. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈమూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సాధించిన రాజమౌళి టీమ్.. ఈ సారి అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా కొనసాగుతోంది.

ఇక వారణాసికి సబంధించి ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమాలో నటించబోయే స్టార్ కాస్ట్ పై ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్స్ పేర్లు మాత్రమే వినిపించాయి. మిగిలిన నటీనటులపై ఇంత వరకూ క్లారిటీ లేదు. రాజమౌళి కూడా అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ముందు ముదు ఈసినిమాలో చాలా ట్విస్ట్ లు ఉన్నట్టు తెలుస్తోంది.

రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా!

ఈక్రమంలో వారణాసికి సబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడుతున్నారని తెలుస్తోంది. రాజమౌళి చెప్పినట్టు వింటూ.. మార్పులు ఉంటే చేసుకుంటూ.. మహేష్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈక్రమంలో ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వినిపిస్తోంది. ఈ మూవీలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కూడా నటించబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే వన్ నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. ఆతరువాత స్టడీస్ కోసం ఫారెన్ వెళ్లాడు. రీసెంట్ గా తన స్టడీస్ పూర్తి చేసుకున్నాడట. వారణాసిలో గౌతమ్ కు సూట్ అయ్యే ఓ పాత్ర ఉండటంతో.. రాజమౌళి గౌతమ్ ను తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాలో గౌతమ్ కృష్ణకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉండటంతో.. జక్కన్నే స్వయంగా ఈ పాత్రను గౌతమ్ తో చేయించాలని అనుకున్నాడట.

మహేష్ బాబు వారసుడు వచ్చేస్తున్నాడా?

మహేష్ బాబు, గౌతమ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయన్నదానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలయ్యింది. ఈ విషయం అపీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు. అంతేకాదు ఆ పాత్ర ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే.. అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే.

నిజంగా ఈసినిమాలో గౌతమ్ కనిపిస్తే.. ముందు ముందు మహేష్ బాబు వారసుడిగా గౌతమ్ కృష్ణ ఎంట్రీ కి రూట్ క్లియర్ అయినట్టే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా రాజమౌళి వంటి దర్శకుడి సినిమా ద్వారా గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇస్తే.. అది అతని కెరీర్ కు ప్లస్ అవుతుందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు. ఇక వారణాసి షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈసమ్మర్ కానుకగా ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

మహేష్ బాబు తనయుడు గౌతమ్ రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడనే వార్త టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.