
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న #SSMB29 చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్ అప్డేట్ రాబోతోంది. నవంబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్న భారీ ఈవెంట్‌లో టైటిల్, గ్లింప్స్ విడుదల కానున్నాయి.
Key Points
మహేష్ బాబు-రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం #SSMB29 ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
వచ్చే నెలలో హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు.
నవంబర్ 11 లేదా 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకలో టైటిల్, గ్లింప్స్ విడుదల కానున్నాయి.
ఇది పబ్లిక్ ఈవెంట్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
మహేష్-రాజమౌళి కాంబినేషన్ క్రేజ్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా కాదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు, కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఏజ్ పైబడినప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తన 29వ సినిమాను జక్కన్నతో తీస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో మహేష్ బాబు-రాజమౌళి సినిమా వస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.
వచ్చే నెలలో హైదరాబాద్ లో ఓ భారీ ఈవెంట్ ఈ సినిమా కోసం నిర్వహిస్తున్నారట. నవంబర్ 11వ తేదీ లేదా నవంబర్ 15వ తేదీలలో ఈ వేడుక జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది పబ్లిక్ ఈవెంట్ అని టాక్. అంటే ఫ్యాన్స్ కు కూడా ప్రవేశం ఉండవచ్చని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరు అందుకుంది. అయితే హైదరాబాద్ లోనే ఎక్కడ ఈవెంట్ నిర్వహిస్తారు ? అన్న దానిపైన క్లారిటీ రాలేదు. ఈ ఈవెంట్ లో టైటిల్ తో పాటు గ్లింమ్స్ వీడియో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కొత్త ఉత్సాహంలో కనిపిస్తున్నారు.
#SSMB29 ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ?
టైటిల్, గ్లింప్స్ విడుదల ఖాయమా?
#SSMB29 ఈవెంట్ పబ్లిక్ కావడం, టైటిల్-గ్లింప్స్ విడుదలవుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ మెగా ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


