
📌 Key Points
- ఇలియానా: ‘పోకిరి’తో సెన్సేషన్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్, బాలీవుడ్ ఎంట్రీ, ప్రేమ వ్యవహారాలతో కెరీర్ డౌన్!
- రకుల్ ప్రీత్ సింగ్: రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబులతో సూపర్ హిట్స్, పెళ్లి తర్వాత టాలీవుడ్ అవకాశాలు తగ్గాయ్!
- ప్రణీత సుభాష్: పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో గుర్తింపు, 2021లో వివాహం, సినిమాలకు గుడ్ బై!
- కాజల్ అగర్వాల్: రాంచరణ్ తో ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్, అగ్ర హీరోల సరసన విజయాలు, పెళ్లి తర్వాత కెరీర్ స్లో డౌన్!
టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు స్టార్ డమ్ సంపాదించినా పెళ్లి తర్వాత మాయమవుతున్నారు. మహేష్, పవన్, రాంచరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఆ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం!
ఇలియానా: పోకిరితో స్టార్ డమ్, ఆ తర్వాత ఏమైంది?
టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు వెలిగి మాయమైపోతుంటారు. పెళ్ళైన తర్వాత హీరోయిన్ల కెరీర్ మునుపటిలా సాగదు. టాలీవుడ్ లో అదిరిపోయే హిట్లు అందుకుని పెళ్ళైన తర్వాత కనిపించకుండా పోయిన ఐదుగురు హీరోయిన్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వీరిలో కొందరు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.
ఇలియానా పోకిరి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. మహేష్ బాబు సరసన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇలియానా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలన విజయం సాధించింది. టాలీవుడ్ లో కెరీర్ పీక్ లో ఉన్న టైంలో ఆమె బాలీవుడ్ కి వెళ్ళింది. ప్రేమ వ్యవహారాలు ఇలియానా కెరీర్ ని దెబ్బతీశాయి. పెళ్లి తర్వాత ఇలియానా పూర్తిగా సినిమాలకు దూరమైంది.
రకుల్ ప్రీత్ సింగ్: బాలీవుడ్ పెళ్లితో టాలీవుడ్ కి గుడ్ బై?
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ లేదు కానీ మంచి విజయాలు ఉన్నాయి. రాంచరణ్ తో ధ్రువ, బ్రూస్లీ లాంటి చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ లతో కూడా నటించింది. బాలీవుడ్ నిర్మాతతో వివాహం తర్వాత రకుల్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గాయి.
ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రం గుర్తుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్రణీత కెరీర్ లోనే మెమొరబుల్ మూవీ. 2021లో వివాహం చేసుకున్న తర్వాత ప్రణీత సినిమాలకు దూరమైంది.
కాజల్, ప్రణీత: పెళ్లి తర్వాత కెరీర్ కు బ్రేక్!
రాంచరణ్ తో మగధీర లాంటి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన చిత్రంలో కాజల్ నటించింది. కాజల్ టాలీవుడ్ లో చాలా సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేసింది అనే చెప్పాలి. అందరు అగ్ర హీరోలతో ఆమెకి హిట్లు ఉన్నాయి. కానీ పెళ్లైన తర్వాత కాజల్ కెరీర్ నెమ్మదించింది.
సినిమాల కంటే తన వ్యక్తిగత విషయాలతో అమలాపాల్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అమలాపాల్ తెలుగులో అల్లు అర్జున్, రాంచరణ్, నాగ చైతన్య లాంటి హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. రెండో పెళ్లి తర్వాత అమలా పాల్ సినిమాలకు దూరమైంది.
ఈ హీరోయిన్లు ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలారు. కానీ పెళ్లి తర్వాత కెరీర్ కి దూరం కావడం బాధాకరం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


