|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్, రాజమౌళి సినిమా సెట్: రూ. 50 కోట్లు!

Published: 19-06-2025, 8:18 PM
మహేష్, రాజమౌళి సినిమా సెట్: రూ. 50 కోట్లు!

టాలీవుడ్‌లో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రామోజీ ఫిలిం సిటీలో రూ. 50 కోట్లతో భారీ సెట్ నిర్మించబోతున్నట్లు సమాచారం.

Key Points

1

మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం రూ. 50 కోట్లతో భారీ సెట్ నిర్మాణం!

2

రామోజీ ఫిలిం సిటీలో వారణాసి తరహాలో అత్యంత విశాలమైన సెట్!

4

హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటించే అవకాశాలు ఉన్నాయి.

భారీ సెట్ నిర్మాణం

టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్ కాంబినేషన్ లో బడా మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో… నటీనటులు ఇంకా ఫైనల్ కాలేదు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్

విదేశాల్లో ఎక్కువగా ఈ సినిమా షూట్ జరిగే ఛాన్స్ లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీ లో… షూటింగ్ జరుపుకునేందుకు సిద్ధం అవుతోందట. ఈ మేరకు చిత్ర బృందం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొత్త ప్రచారం జరుగుతోంది. అయితే రామోజీ ఫిలిం సిటీ లో… మహేష్ బాబు, జక్కన్న కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం… ప్రత్యేక సెట్ ఏర్పాటు చేయబోతున్నారట.

ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా?

సినిమా అయిపోయే వరకు ఆ సెట్ అక్కడే ఉంటుందని తెలుస్తోంది. దీనికోసం 50 నుంచి 55 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నారు. అచ్చం వారణాసి తరహాలో… రామోజీ ఫిలిం సిటీ లో అతి పెద్ద సెట్ నిర్మించబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సెట్ లోనే సినిమా దాదాపు కొనసాగుతుందని చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొత్తంగా, మహేష్ బాబు మరియు రాజమౌళి సినిమా కోసం అద్భుతమైన సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ సినిమా అంచనాలను అందుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.