|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: మిస్టరీ మ్యాన్‌తో మలైకా డేటింగ్ నిజమెంత? కుండబద్దలు కొట్టిన హీరోయిన్!

Published: 18-01-2026, 3:00 AM
షాకింగ్ న్యూస్: మిస్టరీ మ్యాన్‌తో మలైకా డేటింగ్ నిజమెంత? కుండబద్దలు కొట్టిన హీరోయిన్!
  • అర్జున్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత మలైకా డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ!
  • మిస్టరీ మ్యాన్‌తో కాదు, గే ఫ్రెండ్స్‌తో కూడా సంబంధాలు అంటోన్న మలైకా!
  • వార్తలు చూసి షాక్ అవుతున్న మలైకా తల్లి, అసలు నిజం చెప్పేసిన హీరోయిన్!
  • ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్, వ్యక్తిగత ప్రశాంతత ముఖ్యమని తెలిపిన మలైకా అరోరా!

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. అర్జున్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత ఆమె డేటింగ్ గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై మలైకా ఎలా స్పందించిందో చూద్దాం!

అర్జున్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత డేటింగ్ రూమర్స్

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత మలైకా అరోరా డేటింగ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక మిస్టరీ మ్యాన్‌తో ఆమె చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందన్న ప్రచారంపై మలైకా అరోరా తాజాగా స్పష్టతనిచ్చారు. ఇప్పుడు మలైకా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ ఫిట్‌నెస్ బ్యూటీ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అర్బాజ్ ఖాన్‌తో విడాకులు, ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో సుదీర్ఘ కాలం డేటింగ్.. ఇలా ఆమె లైఫ్ ఓపెన్ బుక్ అని తెలిసిందే.

గే ఫ్రెండ్స్‌తో కూడా సంబంధాలు అంటున్నారంటూ ఆవేదన

అయితే, ఇటీవల అర్జున్‌ కపూర్‌తో బ్రేకప్ తర్వాత మలైకా అరోరా ఎవరితో కనిపించినా ‘మిస్టరీ మ్యాన్’ ఎవరూ అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓ మిస్టరీ మ్యాన్‌తో మలైకా అరోరా డేటింగ్ చేస్తోందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఆ క్రమంలో ఈ పుకార్లపై మలైకా అరోరా తాజాగా ‘ది నమ్రత జకారియా షో’లో క్లారిటీ ఇచ్చారు.

“నిజం చెప్పాలంటే.. నేను బయట అడుగుపెట్టిన ప్రతిసారి నా పాత స్నేహితుడు కావచ్చు, పెళ్లయిన ఫ్రెండ్ కావచ్చు, నా మేనేజర్ కావచ్చు.. చివరకు నా గే ఫ్రెండ్స్‌తో కనిపించినా సరే, వారితో నాకు ముడిపెట్టేస్తున్నారు (సంబంధం)” అని ఆవేదన వ్యక్తం చేశారు మలోకా అరోరా.

వార్తలపై స్పందించిన మలైకా అరోరా తల్లి రియాక్షన్!

ఈ వార్తలు చూసి తన తల్లి కూడా ఆశ్చర్యపోతారని మలైకా అరోరా తెలిపారు. “నా తల్లి ఫోన్ చేసి.. ‘ఎవరు బేబీ వీళ్లు? ఇప్పుడు మళ్లీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు?’ అని అడుగుతుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వింటే నాకు కేవలం నవ్వు మాత్రమే వస్తోంది” అని మలైకా అరోరా పేర్కొన్నారు.

2016 నుంచి అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్న మలైకా అరోరా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల హీరోతో విడిపోయారు. ప్రస్తుతం మలైకా అరోరా తన కెరీర్, ఫిట్‌నెస్ , వ్యక్తిగత ప్రశాంతతపై దృష్టి పెట్టారు.

మలైకా అరోరా డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.