
📌 Key Points
- హీరోయిన్ మలైకా అరోరా విడాకులు, రెండో పెళ్లిపై సమాజ వివక్షను ప్రశ్నించింది.
- మగవారికో న్యాయం, ఆడవారికో న్యాయమా అని ద్వంద్వ వైఖరిని ఆమె ఎండగట్టింది.
- తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌పై మలైకా ఆవేదన వ్యక్తం చేసింది.
- అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో మలైకా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బాలీవుడ్ నటి మలైకా అరోరా విడాకులు, రెండో పెళ్లి విషయంలో సమాజం చూపే వివక్షపై బోల్డ్ గా స్పందించారు. మగవారికో న్యాయం, ఆడవారికో న్యాయమా అని ప్రశ్నిస్తూ, స్త్రీలపై జరిగే విమర్శలను ఆమె ఎండగట్టారు. మలైకా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మలైకా అరోరా బోల్డ్ కామెంట్స్
విడాకులు, రెండో పెళ్లి విషయంలో సమాజం చూపే వివక్షపై బోల్డ్ హీరోయిన్ మలైకా అరోరా గళం విప్పారు. మగవారు విడాకులు తీసుకుని, వయసులో తమకంటే సగం చిన్నవారైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మెచ్చుకునే సమాజం.. స్త్రీని మాత్రం ఎందుకు విమర్శిస్తుందని ఆమె నిలదీశారు. మలైకా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇవే.
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితం గురించి, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకులు , బ్రేకప్ వంటి వ్యక్తిగత విషయాల్లో మగవారిని ఒకలా, ఆడవారిని మరోలా చూసే ‘ద్వంద్వ ప్రమాణాలను/వైఖరిని’ (Double Standards) ఆమె ఎండగట్టారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మలైకా అరోరా.. సమాజం తీరుపై తనదైన శైలిలో స్పందించారు.
సమాజంలో ద్వంద్వ ప్రమాణాలు
“అదే ఒక స్త్రీ తన జీవితంలో విడాకులు తీసుకుని, కొత్తగా మరో బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే మాత్రం.. ‘ఆమెకు అసలు బుద్ధి ఉందా? ఈ వయసులో ఎందుకిలా చేస్తోంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మగాడికి చప్పట్లు, ఆడవాళ్లకు విమర్శలా? ఇలాంటి మూస పద్ధతులకు, పాతకాలపు ఆలోచనలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది” అని మలైకా అరోరా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ప్రతీ విషయంలో సోషల్ మీడియా లో మలైకా అరోరాపై కామెంట్స్, ట్రోలింగ్ వస్తూనే ఉంది. కేవలం ఒక మహిళ అయిన అందుకే ఆమె ప్రతి నిర్ణయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారన్నది మలైకా అరోరా ఆరోపణ.
మహిళలపై విమర్శలు ఎందుకు?
మరోవైపు, అర్బాజ్ ఖాన్ డిసెంబర్ 2023లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు అక్టోబర్ 5, 2025న తమ కుమార్తె ‘సిపారా ఖాన్’కు (Sipaara Khan) జన్మనిచ్చారు. అర్బాజ్ తన జీవితంలో ముందుకు సాగి తండ్రి కూడా అయిన నేపథ్యంలో మలైకా అరైరా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మలైకా అరోరా వ్యాఖ్యలు సమాజంలో పాతుకుపోయిన ద్వంద్వ ప్రమాణాలను మరోసారి గుర్తు చేశాయి. స్త్రీ, పురుషులిద్దరికీ సమాన గౌరవం లభించాల్సిన ఆవశ్యకతను ఆమె మాటలు నొక్కిచెబుతున్నాయి. ఈ చర్చ సమాజంలో మార్పునకు నాంది పలకాలని ఆశిద్దాం.


