|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీరు మాళవిక ప్రేమలో పడిపోవడం ఖాయం.. యంగ్ హీరో కామెంట్స్ వైరల్

Published: 09-07-2025, 4:47 AM
మీరు మాళవిక ప్రేమలో పడిపోవడం ఖాయం.. యంగ్ హీరో కామెంట్స్ వైరల్

‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం జులై 11న విడుదలవుతోంది. తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరో సుహాస్ మరియు మంచు మనోజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుహాస్ మాళవిక నటనను ప్రశంసించాడు.

Key Points

1

సుహాస్ హీరోగా, మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం జులై 11న విడుదల.

2

ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సుహాస్, మంచు మనోజ్ మాట్లాడిన విషయాలు వైరల్ గా మారాయి.

4

చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని సుహాస్ మరియు మంచు మనోజ్ ఆశించారు.

‘ఓ భామ అయ్యో రామ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సహాస్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. జులై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. కాగా తాజాగా ‘ఓ భామ అయ్యో రామ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సుహాస్ మరియు మంచు మనోజ్ కామెంట్స్

ఈ సందర్బంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ.. ‘సుహాస్‌ నాకు సోదరుడు లాంటి వాడు. ఎప్పుడూ కలిసిన చిరునవ్వుతో పాజిటివ్‌గా ఉంటాడు. ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగాడు. నేపో కిడ్స్‌ అయినా సినిమా పరిశ్రమలో కష్టపడాల్సిందే. కష్టపడితేనే విజయం. నేను ఈ విషయాన్ని ఓ నెపో కిడ్‌గా చెబుతున్నా. యూట్యూబ్‌ నుంచి హీరోగా ఎదిగిన సుహాస్‌ జర్నీ ఎంతో ఇన్‌స్పిరేషన్‌. తమిళంలో విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ కూడా అలాంటి స్టారే.. అన్ని తరహా సినిమాలను చేస్తాడు. ఇండస్ట్రీలో సక్సెస్‌ కావడం కష్టమే. కాని కష్టపడితే సక్సెస్‌ సాధిస్తాం. ఈ సినిమా విజయం సాధించి నిర్మాతలకు, దర్శకుడికి బ్రేక్‌ నివ్వాలి. మంచి టీమ్‌తో రూపొందిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావాలి’ అన్నారు.

మాళవిక మనోజ్ నటనపై ప్రశంసలు

హీరో సుహాస్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం టీమ్‌ అంతా ఎంతో కష్టపడ్డారు. అందరూ ఈ సినిమా చూసిన తరువాత మాళవిక ప్రేమలో పడిపోతారు. అలీ, అనిత, పృథ్వీ లాంటి సీనియర్ ఆర్టిస్ట్‌లతో నటించడం ఎంతో హ్యపీగా ఉంది. ప్రతి అబ్బాయి సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌లో తల్లి, భార్యలు ఇద్దరూ ఎంతో కీలకంగా ఉంటారు. ఈ పాత్రలకు సంబంధించిన ఎమోషన్స్‌ ఈ చిత్రంలో అందరి హృదయాలను హత్తుకుంటాయి. అందరి సపోర్ట్‌తో మంచి సినిమాలు చేస్తున్నారు. త్వరలో నా కెరీర్‌కు సంబంధించిన మరిన్ని బిగ్‌న్యూస్‌ తెలియజేస్తాను’ అన్నారు.

చివరగా, సుహాస్ మరియు మంచు మనోజ్ ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నారు. మాళవిక మనోజ్ నటనపై వచ్చిన ప్రశంసలు చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.