|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కార్తీ-29’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్

Published: 26-06-2025, 5:53 AM
‘కార్తీ-29’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్

కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న ‘కార్తీ-29’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలైలో ప్రారంభమయ్యే ఈ చిత్రం 1960ల నేపథ్యంలో రూపొందుతోంది.

Key Points

1

‘కార్తీ-29’ సినిమా షూటింగ్ జూలై నుంచి ప్రారంభం.

2

నాని గెస్ట్ రోల్‌లో నటించే అవకాశం.

4

స్మగ్లింగ్ ఫ్లాట్ నుండి స్ఫూర్తి పొందిన గ్యాంగ్స్టర్ డ్రామా.

‘కార్తీ-29’ చిత్రం విశేషాలు

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్(Karthik Shivakumar) గత ఏడాది ‘సత్యం సుందరం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. అదే ఫామ్‌లో ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో ‘ఖైదీ-2’ మూవీ చేస్తున్న ఆయన ‘సర్దార్-2’ షూటింగ్‌కు కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కార్తీ-తమిజ్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రానుంది. అయితే ఈ సినిమా ‘కార్తీ-29’(Karthi-29) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. జూలై నుంచి ఈ మూవీ సెట్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ చిత్రం 1960 బ్యాక్ డ్రాప్‌లో రామేశ్వరం తీరం నేపథ్యంలో స్మగ్లింగ్ ఫ్లాట్ నుంచి స్ఫూర్తి పొందిన పిరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నారు.

ఇందులో కార్తీ సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివిన్ పౌలీ(Nivin Pauly), జయరాం కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, ఈ సినిమాలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో జాయిన్ కాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల వరుస హిట్స్ సాధించిన నాని ‘కార్తీ-29’లో గెస్ట్ రోల్‌లో నటించనున్నట్లు టాక్. ఈ ఏడాది నాని నటించిన ‘హిట్-3’మూవీలో కార్తీ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నాని కూడా కార్తీ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

నాని గెస్ట్ రోల్‌పై సోషల్ మీడియా చర్చ

సినిమా కథాంశం మరియు నటీనటులు

‘కార్తీ-29’ సినిమాలో నాని గెస్ట్ రోల్ చేయడం చిత్రానికి మరింత ఆకర్షణను తెస్తుంది. అభిమానుల ఆసక్తిని పెంచుతున్న ఈ వార్తతో చిత్రంపై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.