|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ మూవీలో మాళవిక స్టంట్స్ రచ్చ! డూప్ ఉందా? లేకుంటే నిజంగా చేసిందా?

Published: 13-02-2026, 11:05 PM
ప్రభాస్ మూవీలో మాళవిక స్టంట్స్ రచ్చ! డూప్ ఉందా? లేకుంటే నిజంగా చేసిందా?
  • ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీలో మాళవిక మోహనన్ స్టంట్స్ పై ట్రోల్స్!
  • యాక్షన్ సీక్వెన్స్‌లలో డూప్ వాడారని వచ్చిన వార్తలపై మాళవిక క్లారిటీ
  • చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ అంటే ఇష్టమని, అందుకే స్టంట్స్ చేశానన్న మాళవిక
  • స్టంట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన మాళవిక మోహనన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న ‘ది రాజాసాబ్’ మూవీలో హీరోయిన్ మాళవిక మోహనన్ స్టంట్స్ పై వస్తున్న ట్రోల్స్ కు చెక్ పెట్టింది. ఆమె స్వయంగా స్టంట్స్ చేసిన వీడియోను షేర్ చేసింది.

మాళవిక స్టంట్స్ పై ట్రోల్స్ వెనుక అసలు నిజం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి (Maruthi)కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). ఈ సినిమాను కామెడీ, హరర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించగా.. ఇందులో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఇందులో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా చాలా స్టైలిష్‌గా, వింటేజ్ లుక్‌లో కనిపించాడు. సంక్రాంతి కానుకగా.. విడుదలై.. బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. కానీ విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఇటీవల ఇక యాక్షన్ ఎపిసోడ్‌లో మాళవిక తన స్టంట్స్ తాను చేయలేదని.. ఆమెకు బదులుగా ఒక స్టంట్ డబుల్ బాడీ డూప్ చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్స్‌లో ఓ అమ్మాయి మాళవిక వేసుకున్న డ్రెస్ వెసుకుని ఉన్న ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. తాజాగా, ఈ విషయంపై మాళవిక తన ట్విట్టర్ ద్వారా స్పందించింది.

తాను రోప్స్ సాయంతో గాలిలో వేలాడుతూ ప్రాక్టీస్ చేస్తున్న బిహైండ్‌ది సీన్స్ వీడియోను ప్రూఫ్‌గా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె రెండు ముఖ్యమైన విషయాలను వివరిస్తూ.. “నేను చిన్నప్పటి నుండి స్పోర్టీ గర్ల్‌ని. కొత్త విషయాలు నేర్చుకోవడం, శారీరక సవాళ్లను స్వీకరించడం నాకు చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లను నేను నిజంగా ఎంజాయ్ చేస్తూ చేశాను. నటులు స్వయంగా స్టంట్స్ చేస్తున్నా కూడా, సెట్స్‌లో ప్రొఫెషనల్ స్టంట్ డబుల్స్ ఎప్పుడూ ఉంటారు. నటులు చివరి షాట్ ఇచ్చే ముందు రిహార్సల్స్ కోసం లేదా అత్యంత రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు, నిపుణుల సలహాలు వారి సాయం తీసుకోవడం చిత్ర పరిశ్రమలో సర్వసాధారణం. కానీ సినిమాలో మీరు చూసిన యాక్షన్ సీక్వెన్స్‌లో నేను స్వయంగా పాల్గొన్నాను. అమ్మాయిలకు సినిమాల్లో యాక్షన్ సీన్స్ రావడం చాలా అరుదు. అందుకే ఇష్టమైన స్టంట్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను. అయినప్పటికీ ట్రోల్ చేయడం బాధాకరం. దయచేసి తప్పుడు వార్తలు సృష్టించకండి”అని రాసుకొచ్చింది.

స్టంట్స్ పై మాళవిక మోహనన్ క్లారిటీ!

వైరల్ అవుతున్న బిహైండ్ ది సీన్స్ వీడియో

మాళవిక మోహనన్ వివరణతో ఈ వివాదానికి తెరపడింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.