
📌 Key Points
- ది రాజాసాబ్ సినిమాలో స్టంట్స్ తానే చేశానన్న మాళవిక.
- డూప్ ఉపయోగించారంటూ వస్తున్న వార్తలకు వీడియో సాక్ష్యాలతో చెక్.
- యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డానని తెలిపిన మాళవిక.
- మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాళవిక మోహనన్.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమాలో మాళవిక మోహనన్ స్టంట్స్ పై వస్తున్న రూమర్లకు ఆమె స్వయంగా స్పందించారు. సినిమాలో డూప్ వాడలేదని, అన్ని స్టంట్స్ తానే చేశానని ఆమె క్లారిటీ ఇచ్చారు.
స్టంట్స్ పై మాళవిక క్లారిటీ
The RajaSaab:ప్రముఖ దర్శకుడు మారుతీ (Maruthi )దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన చిత్రం ‘ది రాజాసాబ్’. ప్రభాస్ కెరియర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. నిజానికి ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా చాలా స్టైలిష్ గా వింటే లుక్కులో కనిపించారు. కానీ సీన్స్ తెరపై చూపించడంలో మారుతీ ఫెయిల్ అయ్యాడనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహనన్ (Malavika mohanan), నిధి అగర్వాల్(Niddhi Agerwal), రిద్దీ కుమార్ (Riddhi Kumar) హీరోయిన్లుగా నటించారు.
ఇకపోతే ఈ సినిమా విడుదలైన నెలలోపే జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఓటీటీలో చూసిన ఆడియన్స్.. ఒక విలన్ తో మాళవిక ఫైట్ చేసే సన్నివేశంలో మాళవిక స్థానంలో డూపును పెట్టి కానించేసారు అనే విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఆ ఫైట్ సీన్లో విలన్ గా నటించిన రాన్సన్ విన్సెంట్ కూడా మాళవిక గెటప్ లో ఉన్న డూప్ తో కలిసి ఫోటో షేర్ చేయడంతో నిజంగానే డూప్ ని వాడారు. అయితే ఇక్కడ అమ్మాయి కోసం అబ్బాయిని డూప్ గా వాడడం ఏంటి అంటూ చాలామంది విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై తాజాగా మాళవిక స్పందించింది.
మాళవిక ఎక్స్ వేదికగా..” నేనే నా స్టంట్స్ చేశాను సినిమాల్లో రిస్కీ షార్ట్స్ చేసేటప్పుడు లేదా రిహార్సల్స్ కోసం ప్రొఫెషనల్ స్టంట్ డబుల్స్ ఉండడం సర్వసాధారణం. కానీ సినిమాలో మీరు చూసిన ఆ యాక్షన్ సీక్వెన్స్ లో నేను స్వయంగా పాల్గొన్నాను. నిజానికి అమ్మాయిలకు యాక్షన్ సీన్స్ చేసే అవకాశం రావడం చాలా అరుదు అందుకే ఇష్టమైన స్టంట్స్ చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను అని వీడియో ఆధారాలతో సహా మాళవిక సమాధానం ఇచ్చింది. ఇక మాళవిక సమాధానంతో ట్రోలర్స్ నోళ్లు మూతపడ్డాయని చెప్పవచ్చు.. ఇకపోతే సెట్స్ లో ఈమె స్వయంగా రోప్ సహాయంతో కష్టమైన ఫైట్స్ చేస్తున్న బిహైండ్ ద సీన్స్ వీడియోలను ప్రూఫ్స్ గా షేర్ చేసింది మాళవిక మోహన్. మొత్తానికైతే ఇన్ని రోజులు డూప్ అంటూ చేసిన కామెంట్లకు ఆమె ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిందని చెప్పవచ్చు.
డూప్ అంటూ విమర్శలు
మాళవిక మోహనన్ విషయానికి వస్తే.. మలయాళంలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈమె.. తొలిసారి ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాళవికకు ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందివ్వకపోవడం బాధాకరం అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం తమిళ్, మలయాళం చిత్రాలలో బిజీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Been seeing a lot of tweets and articles about how I claimed to do my own stunts for ‘The Rajasaab’ but a body double did it as there’s a photo circulating online of a stunt artist who was my stunt double on the film.
వీడియోలతో సమాధానం ఇచ్చిన నటి
Firstly, I do action because I really enjoy doing action.… pic.twitter.com/9ePwlLpti4
— Malavika Mohanan (@MalavikaM_) February 13, 2026
మాళవిక మోహనన్ స్వయంగా స్టంట్స్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ ట్రోలర్లకు సమాధానం ఇచ్చింది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. ఆమె తొలిసారి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమాతో పలకరించింది.


