
📌 Key Points
- ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’ సినిమాలో నటించిన మాళవిక మోహనన్.
- విజయ్ సేతుపతితో కలిసి ‘పాకెట్ నావెల్’ సినిమాలో నటించనున్న మాళవిక.
- ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా.
- ఒకే షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు కుమారరాజా ప్లాన్.
ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాలో నటించిన మాళవిక మోహనన్ ఇప్పుడు విజయ్ సేతుపతితో కలిసి నటించనుంది. తియాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్న ‘పాకెట్ నావెల్’ అనే చిత్రంలో వీరిద్దరూ జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
విజయ్ సేతుపతితో మాళవిక మోహనన్ నెక్స్ట్ మూవీ
Malavika Mohanan: మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ (Malavika Mohanan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. సౌత్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ యంగ్ బ్యూటీ.. ఇటీవల తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది .కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇదిలో ఉండగా ఈమె మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ఈమె హీరోయిన్గా జతకట్టబోతోంది. విలక్షణ దర్శకుడు తియాగరాజన్ కుమారరాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘పాకెట్ నావెల్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఇందులో ప్రముఖ నటుడు కిషోర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అరణ్య కాండం, సూపర్ డీలక్స్ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కుమార రాజా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం కావడంతో ఇప్పుడు అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
‘పాకెట్ నావెల్’ చిత్రానికి ఇళయరాజా సంగీతం
మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా మ్యూజిక్ కంపోజింగ్ పని దాదాపు పూర్తయిందట. అటు సినిమా అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబోతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా మాళవిక కెరియర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.. ఇకపోతే దర్శకుడు కూడా ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా ఒకే షెడ్యూల్లో చిత్రం మొత్తాన్ని పూర్తి చేయాలని దర్శకుడు ఆలోచిస్తున్నారట. వినూత్నమైన మేకింగ్ స్టైల్ కు పేరుగాంచిన కుమారరాజా.. విజయ్ సేతుపతి, మాళవిక కాంబినేషన్ ను తెరపై ఎలా చూపిస్తారో అన్న సంగతి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేయాలని ప్లాన్
మాళవిక మోహనన్ మోడల్గా కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత మలయాళ సినిమా ‘ పట్టం పోల్’ అనే చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు , తమిళ్ , హిందీ భాషా సినిమాలలో నటించింది. ఇక చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020లో ఐదవ స్థానంలో నిలిచింది. తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె.. ఇప్పుడు తెలుగు అరంగేట్రం కూడా చేసేసింది. మరొకవైపు విజయ్ సేతుపతి మూవీతో పాటు కార్తీ సర్దార్ 2 లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చిత్రీకరణ జరుపుకుంటుంది.
మొత్తానికి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మాళవిక మోహనన్ కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.


