|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండతో మాళవిక మోహనన్ సినిమా… చివర్లో ఎందుకు ఆగిపోయింది? షాకింగ్ నిజాలు!

Published: 05-01-2026, 7:00 AM
విజయ్ దేవరకొండతో మాళవిక మోహనన్ సినిమా... చివర్లో ఎందుకు ఆగిపోయింది? షాకింగ్ నిజాలు!
  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’తో మాళవిక మోహనన్ టాలీవుడ్ అరంగేట్రం.
  • విజయ్ దేవరకొండతో చేయాల్సిన ‘హీరో’ సినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది.
  • ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ దేవరకొండ ‘హీరో’ సినిమాలో మాళవిక హీరోయిన్.
  • ముంబైలో షిఫ్టింగ్ సమయంలో ‘రాజా సాబ్’ ఆఫర్ వచ్చిందని వెల్లడి.

మాళవిక మోహనన్ ‘ది రాజా సాబ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అంతకుముందే ఆమె విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సింది. చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో, ఆమె టాలీవుడ్ అరంగేట్రం ఎలా జరిగిందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

విజయ్ దేవరకొండతో మాళవిక మోహనన్ తొలి ఛాన్స్ మిస్

Malavika Mohanan: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా 9వ తేదీ విడుదల కాగా 8వ తేదీ సాయంత్రమే ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఈ సినిమా విడుదలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే. ఇలా ఈ ముగ్గురు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాకు కావలసినంత హైప్ ఇస్తున్నారు.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన మాళవిక మోహనన్తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ తో నటించిన ఈ సినిమా ద్వారా మాళవిక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తనకు ప్రభాస్ కంటే ముందుగానే విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వచ్చిందని చివరి నిమిషంలో ఈ సినిమా ఆగిపోయిందని మాళవిక తెలియజేశారు. మరి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ఈమె నటించాల్సిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..

ఆగిపోయిన ‘హీరో’ సినిమా కథేంటి?

విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు హీరో(Hero) అనే సినిమాలో నటించే అవకాశం వచ్చిందట ఈ సినిమాలో మాళవికను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలి అనుకున్న సమయంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని తెలియజేశారు. ఈ సినిమా ఆగిపోయిన అనంతరం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పనులలో బిజీ అయ్యారని తద్వారా తన టాలీవుడ్ ఎంట్రీ కూడా ఆగిపోయిందని తెలియజేశారు.

ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..

ప్రభాస్ ‘రాజా సాబ్’తో టాలీవుడ్ ఎంట్రీ

ఇక అనుకోకుండా తనకు రాజా సాబ్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు. ముంబైలో తను తన ఇంటి నుంచి మరొక ఇంటికి షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో ఆ పనులలో బిజీగా ఉన్నాను అనుకోకుండా రాజా సాబ్ టీం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఈ సందర్భంగా మాళవిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాతో తాను తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. మరి ప్రభాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయినా, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో టాలీవుడ్‌లోకి రావడం ఆనందంగా ఉందని మాళవిక మోహనన్ తెలిపారు. ‘ది రాజా సాబ్’ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.