|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మలయాళం బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్, రూ.200 కోట్ల మూవీ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా.. స్ట్రీమింగ్ అయ్యేది ఈ ఓటీటీలోనే..

Published: 12-05-2025, 10:09 AM
మలయాళం బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్, రూ.200 కోట్ల మూవీ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా.. స్ట్రీమింగ్ అయ్యేది ఈ ఓటీటీలోనే..

మోహన్ లాల్ నటనతో ప్రేక్షకులను అలరించిన ‘తుడరుమ్’ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రతి ఒక్కరికీ ఆసక్తిగా ఉంది.

Key Points

1

రూ. 200 కోట్ల వసూళ్లు సాధించిన మలయాళం బ్లాక్ బస్టర్ 'తుడరుమ్'

2

మోహన్ లాల్, శోభన జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్

4

మలయాళం, తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్

తుడరుమ్: రూ.200 కోట్ల బ్లాక్ బస్టర్

మలయాళం ఇండస్ట్రీలో ప్రస్తుతం మోహన్ లాల్ ఊపు మీదున్నాడు. ఎల్2 ఎంపురాన్ మూవీతో అత్యధిక వసూళ్ల సినిమా రికార్డును బ్రేక్ చేసిన అతడు.. మరో రూ.200 కోట్ల వసూళ్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా పేరు తుడరుమ్ (Thudarum). తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. మోహన్ లాల్ , శోభన లీడ్ రోల్స్ లో నటించిన ఈ తుడరుమ్ మూవీ మే 23 లేదా 30వ తేదీల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది.

మోహన్ లాల్, శోభనల క్రైమ్ థ్రిల్లర్

ఆ ఓటీటీ త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మలయాళంతోపాటు తెలుగు ఆడియోలోనూ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఎల్2: ఎంపురాన్ సినిమా కూడా ఈ జియోహాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మోహన్ లాల్ నటించిన రెండు వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలను ఈ ఓటీటీ సొంతం చేసుకుంది.

తుడరుమ్ మూవీని ప్రముఖ మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి డైరెక్ట్ చేశాడు. గతంలో ఆపరేషన్ జావా, సౌదీ వెల్లక్కే అనే మూవీస్ ను డైరెక్ట్ చేసిన అతడు.. తాజాగా తుడరుమ్ తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. కేవలం రూ.28 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసింది.

జియో హాట్‌స్టార్ లో ఓటీటీ రిలీజ్

ఈ సినిమాలో మోహన్‌లాల్.. షణ్ముగం అలియాస్ బెంజ్ అనే ట్యాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించాడు. ఇక అతని భార్య లలిత పాత్రలో శోభన నటించింది. రన్ని అనే ఓ చిన్న ఊళ్లో వీళ్లు తమ ఇద్దరు పిల్లలో హాయిగా జీవిస్తుంటారు. బెంజ్ కు ఓ బ్లాక్ అంబాసిడర్ కారు ఉంటుంది. అదంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకరోజు బెంజ్ కొడుకు ఫ్రెండ్స్ ఆ కారును చెన్నైకి తీసుకెళ్తారు.

అదే కథను మలుపు తిప్పుతుంది. ఆ కారులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సీజ్ చేస్తారు. బెంజ్ ఎంత వేడుకున్నా అక్కడి ఎస్ఐ కారును రిలీజ్ చేయడానికి అంగీకరించడు. తనకు ఎంతో ఇష్టమైన ఆ కారు కోసం అతడు ఏం చేస్తాడు? ఎంత వరకూ వెళ్తాడన్నదే ఈ తుడరుమ్ మూవీ స్టోరీ.

మొత్తంగా, ‘తుడరుమ్’ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడం ఖాయం. జియో హాట్‌స్టార్ లో ఈ సినిమాను తప్పకుండా చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.