|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి మ‌ల‌యాళం బోల్డ్ కామెడీ మూవీ ‘డ్యాన్స్ పార్టీ’ – ఏడాదిన్న‌ర త‌ర్వాత స్ట్రీమింగ్

Published: 27-05-2025, 2:59 AM
ఓటీటీలోకి మ‌ల‌యాళం బోల్డ్ కామెడీ మూవీ 'డ్యాన్స్ పార్టీ' - ఏడాదిన్న‌ర త‌ర్వాత స్ట్రీమింగ్

ఏడాదిన్నర తర్వాత, మలయాళ బోల్డ్ కామెడీ చిత్రం ‘డ్యాన్స్ పార్టీ’ ఓటీటీలోకి వస్తుంది. శ్రీనాథ్ భాషి, షైన్ టామ్ చాకో నటించిన ఈ చిత్రం మే 30న మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.

Key Points

1

మలయాళ బోల్డ్ కామెడీ 'డ్యాన్స్ పార్టీ' ఓటీటీలోకి

2

శ్రీనాథ్ భాషి, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో

4

బాక్సాఫీస్ వద్ద సగటు విజయం సాధించిన చిత్రం

డ్యాన్స్ పార్టీ: కథా సారాంశం

మ‌ల‌యాళం మూవీ డ్యాన్స్ పార్టీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. మే 30న మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ బోల్డ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మ‌నోర‌మా మ్యాక్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

డ్యాన్స్ పార్టీ మూవీలో శ్రీనాథ్ భాషి, షైన్ టామ్ చాకో, విష్ణు ఉన్నికృష్ణ‌న్ హీరోలుగా న‌టించారు. ప్ర‌యాగ మార్టిన్ లీనా హీరోయిన్లుగా న‌టించారు. సోహాన్ శీనులాల్ ఈ మ‌ల‌యాళం మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

2023 డిసెంబ‌ర్‌లో డ్యాన్స్ పార్టీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. బోల్డ్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్ రొటీన్ అయినా ఈ మూవీలోని కామెడీకి మాత్రం మంచి పేరొచ్చింది.

అనికుట్ట‌న్ ఓ డ్యాన్స‌ర్‌. పొరుగింటిలో ఉండే అనిత‌ను ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటాడు. అనికుట్ట‌న్ అన్న‌య్య‌కు మేయ‌ర్ కూతురితో పెళ్లి కుదురుతుంది. కానీ అనికుట్ట‌న్ స్నేహితుడు బాబీతో మేయ‌ర్ కూతురు ప్రేమ‌లో ఉంటుంది. అన్న‌య్య పెళ్లి కార‌ణంగా అనికుట్ట‌న్ ప్రేమ‌కు ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? అనితకు మేయ‌ర్ కూతురికి ఉన్న సంబంధ‌మేమిటి? అనికుట్ట‌న్‌కు అనిత ఎందుకు దూర‌మైంది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఓటీటీ విడుదల వివరాలు

డ్యాన్స్ పార్టీ మూవీకి ఐఎమ్‌డీబీ లో 4.2 రేటింగ్ వ‌చ్చింది. ఈ సినిమాకు బిజి పాల్‌, రాహుల్ రాజ్ మ్యూజిక్ అందించారు. మంజుమ్మ‌ల్ బాయ్స్‌తో మ‌ల‌యాళంలో ఫేమ‌స్ అయ్యాడు శ్రీనాథ్ బాషి. అంత‌కుముందు భీష్మ ప‌ర్వం, క‌ప్పేలాతో పాటు మ‌ల‌యాళంలో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు.

డ్యాన్స్ పార్టీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన షైన్ టామ్ చాకో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ యాక్ట‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు. తెలుగులో ద‌స‌రా, రాబిన్‌హుడ్‌, దేవ‌ర‌ తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌ల‌తో ఇటీవ‌ల అత‌డిని పోలీసులు అర్జెస్ట్ చేయ‌డం మ‌ల‌యాళంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మొత్తంమీద, ‘డ్యాన్స్ పార్టీ’ ఒక సరదా కామెడీ చిత్రం. మనోరమా మ్యాక్స్‌లో చూడవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.