|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

5 కోట్ల పెట్టుబడితో 180 కోట్ల లాభం! టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మలయాళ సంచలనం!

Published: 15-04-2026, 1:05 PM
5 కోట్ల పెట్టుబడితో 180 కోట్ల లాభం! టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మలయాళ సంచలనం!
  • ‘వాజా 2’ చిత్రం కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 180 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
  • ఈ సినిమా మలయాళంలోని టాప్-5 చిత్రాల జాబితాలో స్థానం సంపాదించింది.
  • విష్ణు, అజు థామస్, మూస స్నేహితుల కథతో మొదటి భాగం రూపొందింది.
  • నలుగురు విద్యార్థుల జీవితంలోని సంఘటనల సమాహారమే ‘వాజా 2’ చిత్రం.

మలయాళంలో సంచలనం సృష్టించిన ‘వాజా 2’ చిత్రం టాలీవుడ్‌లో విడుదల కానుంది. కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఏకంగా 180 కోట్ల రూపాయలు వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. యూత్‌ఫుల్ కంటెంట్‌తో ఈ సినిమా విజయం సాధించింది.

‘వాజా 2’ సంచలన విజయం

Vaazha 2: మీదగ్గర కాస్టింగ్ ఉంటె మా దగ్గర కంటెంట్ ఉందంటూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ మీసం మెలేస్తుంది మలయాళ చిత్ర సీమ. అవును.. భారీ బడ్జెట్ సినిమాలు, సూపర్‌స్టార్ల సపోర్ట్ లేకపోయినా కేవలం యూత్‌ఫుల్ కంటెంట్‌తో వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతూ మైండ్ బ్లాక్ చేస్తుంది.ఈ క్రమంలోనే వచ్చింది  ఏప్రిల్ 2, 2026న కేరళలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘వాజా 2’ (Vaazha 2: Biopic of a Billion Bros).

మలయాళ సినీ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ వసూళ్లు

మలయాళంలో ‘వాజా’ అంటే అరటి మొక్క అని అర్థం, కానీ అక్కడ పనిపాటా లేకుండా తిరిగే కుర్రాళ్లను వెక్కిరించడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. సరిగ్గా అలాంటి ‘వేస్ట్’ అనిపించుకునే నలుగురు కుర్రాళ్ల కథతో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన కేవలం రెండు వారాల్లోనే మలయాళ ఇండస్ట్రీలోని టాప్ హీరోల రికార్డులను సైతం తుడిచిపెట్టేసిందంటే సినిమా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు.అలా ఈ సినిమా హిట్ అనే ట్యాగ్ తో సరిపెట్టుకోకుండా మలయాళ సినీ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నిలిచి ట్రేడ్ పండిట్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది.నిజానికి ఈ సక్సెస్ స్ట్రీక్ మొదలైంది ‘వాజా: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్’ అనే ఫాస్ట్ పార్ట్ తో.

తక్కువ బడ్జెట్‌లో భారీ వసూళ్లు

కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల మార్కును

కథాపరంగా చూస్తె విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు స్నేహితుల అల్లరి, వారి ఇంజినీరింగ్ కాలేజీ గొడవలు, చివరికి డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వంటి అంశాలతో తెరకెక్కించాడు డైరెక్టర్ ఆనంద్ మీనన్.కేవలం 4 కోట్ల రూపాయలతో రూపొందిన ఆ సినిమా ఫుల్ రన్‌లో 38 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఆ సక్సెస్ ఇచ్చిన ఊపుతో సావిన్ ఎస్.ఏ దర్శకత్వంలో వచ్చిన సీక్వెలే ఈ ‘వాజా 2’. హషీర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు విద్యార్థుల జీవితంలో జరిగే ఆసక్తికర సంఘటనలని చూపిస్తూ రెండో భాగం తెరకెక్కించారు.ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేసి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.

ఏప్రిల్ 15 నాటికి ఏకంగా 180 కోట్ల రూపాయల గ్రాస్

సినిమా కథా నేపథ్యం

కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా, ఏప్రిల్ 15 నాటికి ఏకంగా 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి 36 రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ స్థాయి వసూళ్లతో ఇప్పటివరకు మలయాళంలో టాప్-5లో ఉన్న ‘2018’ సినిమా రికార్డులను బద్ధలు కొట్టి ఆ ప్లేస్ పట్టేసింది ఈ సినిమా ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ‘లోక చాప్టర్ 1: చంద్ర’, ‘ఎ2: ఎంపురాన్’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘తుడరుమ్’ వంటి భారీ చిత్రాల సరసన ఈ చిన్న సినిమా నిలవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.విపిన్ దాస్ కథ అందించిన ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాహు గారపాటి కూడా ఒక భాగస్వామి కావడం విశేషం

ఇపుడు అదే షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ద్వారా మరోసారి తెలుగు ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దం అయిపొయింది.‘వాజా-2’ పేరుతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24, 2026న తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.చూడాలి మరి కేరళ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు నాట ఏ మేరకి వసూళ్లు కొల్లగొడుతుందో !

మొత్తానికి ‘వాజా 2’ చిత్రం తక్కువ బడ్జెట్‌తో భారీ విజయాన్ని సాధించి మలయాళ సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఈ సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.