
మలయాళం థ్రిల్లర్ సినిమాల ప్రేమికులకు గుడ్ న్యూస్! ‘ఆజాదీ’ అనే థ్రిల్లర్ సినిమా జూన్ 27న సన్ నెక్స్ట్ మరియు మనోరమ మ్యాక్స్ ఓటీటీల్లో విడుదల కానుంది. గర్భిణీ స్త్రీ, రాజకీయ నేత కొడుకు హత్య.. ఇదీ ఈ సినిమా కథాంశం.
Key Points
మలయాళ థ్రిల్లర్ 'ఆజాదీ' ఒకే రోజు రెండు ఓటీటీల్లో ప్రసారం.
గర్భిణీ స్త్రీ రాజకీయ నేత కుమారుడి హత్య కేసులో ప్రధాన పాత్ర.
శ్రీనాథ్ భాసి, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రధారులు.
ఆజాదీ: రెండు ఓటీటీల్లో ఏకకాల ప్రసారం
మలయాళం థ్రిల్లర్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా? అయితే మీకోసం మరో సినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ పేరు ఆజాదీ (Azadi). బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించకపోయినా.. ఐఎండీబీలో 7.3 రేటింగ్ తో ఫర్వాలేదనిపించింది. మంజుమ్మెల్ బాయ్స్ హీరో శ్రీనాథ్ భాసి లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది. ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వస్తోంది.
మలయాళం థ్రిల్లర్ మూవీ ఆజాదీ మే 23న థియేటర్లలో రిలీజైంది. జో జార్జ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సన్ నెక్ట్స్ (Sun Nxt) ఓటీటీ శుక్రవారం (జూన్ 20) వెల్లడించింది. “నిజం మీకు స్వేచ్ఛనివ్వాలి తప్ప బంధించకూడదు. మీకు ఆజాదీ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. వాళ్లు అతని హక్కును లాక్కున్నారు.
కథానాయిక: గర్భిణీ స్త్రీ, రాజకీయ నేత కుమారుని హత్య
అతడో నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రీడమ్ ఇచ్చేది కాదు.. తీసుకునేది” అనే క్యాప్షన్ తో సన్ నెక్ట్స్ రెండు వరుస ట్వీట్లలో మూవీ స్ట్రీమింగ్ గురించి తెలిపింది. నిజానికి అదే రోజు మనోరమ మ్యాక్స్ ఓటీటీ కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది. గతంలోనే ఆ ఓటీటీ ఈ విషయం చెప్పింది. మూవీ రిలీజ్ కు ముందే ఓటీటీ హక్కులను ఆ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. దీంతో ఒకే రోజు ఈ ఆజాదీ సినిమా రెండు ఓటీటీల్లోకి అడుగుపెట్టబోతోంది.
ఆజాదీ మూవీని జో జార్జ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో మంజుమ్మెల్ బాయ్స్ మూవీ హీరో శ్రీనాథ్ భాసితోపాటు వాణీ విశ్వనాథ్, లాల్, సైజు కురుప్, రవీనా రవిలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ కొట్టాయం మెడికల్ కాలేజీలోనే ఎక్కువగా ఉంటుంది. గంగా అనే ఓ మహిళ చుట్టూ తిరిగే కథ. గర్భవతి అయిన ఆమె ఓ రాజకీయ నేత కొడుకు హత్య కేసులో జైలుకు వెళ్తుంది.
నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం
అయితే ప్రసవం కోసం ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. అక్కడి నుంచే ఆమెను తప్పించేందుకు భర్త ప్లాన్ చేస్తాడు. అయితే వాళ్ల గతం ఆ ప్లాన్ ను దెబ్బ తీస్తుంది. వాళ్ల ప్రత్యర్థులు ఆ హాస్పిటల్లోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి వాళ్లు తప్పించుకోవడం కాదు కదా.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే కష్ట పడాల్సి వస్తుంది. మరి ఆ భార్యాభర్తలు అక్కడి నుంచి తప్పించుకుంటారా లేదా అన్నదే ఈ ఆజాదీ మూవీ స్టోరీ.
గత నెలలో టొవినో థామస్ నటించిన నరివెట్టతో కలిసి థియేటర్లలో రిలీజైందీ ఆజాదీ మూవీ. అయితే బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.
చివరగా, ‘ఆజాదీ’ సినిమా ఓటీటీ విడుదలతో ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన అనుభవం లభించనుంది. రెండు ప్లాట్‌ఫామ్‌లలో ఏకకాలంలో విడుదల కావడం విశేషం.


