
మలయాళ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్ పోర్టులో మల్లెపూలు తీసుకువెళ్ళడం వల్ల భారీ జరిమానాను ఎదుర్కొంది. ఈ సంఘటన తర్వాత ఆమె ఆస్ట్రేలియా అధికారులకు లేఖ రాసింది.
Key Points
ఆస్ట్రేలియాలో మల్లెపూలు తీసుకెళ్లడం నిషిద్ధం.
నవ్య నాయర్‌కు రూ. 1.14 లక్షల జరిమానా.
నటి తన తప్పు కాదని, జరిమానా రద్దు చేయాలని కోరుతూ లేఖ రాశారు.
ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల కఠినతను నటి అనుభవం హైలైట్ చేసింది.
ఆస్ట్రేలియాలో నవ్య నాయర్‌కు జరిమానా
మలయాళ నటి నవ్య నాయర్ ( Navya Nair) ఆస్ట్రేలియాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఆమె మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో దిగారు. అయితే, తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లడంతో అక్కడి ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి . ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్లడం అక్కడ నిషిద్ధం. ఈ క్రమంలోనే నవ్య నాయర్ బ్యాగులో పూలు లభించడంతో ఆమెకు రూ . 1.14 లక్షల జరిమానా విధించారు . ఈ అంశంపై తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు .
తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, జరిమానాను రద్దు చేయాలని కోరుతూ ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖకు నవ్య నాయర్ లేఖ రాశారు. ఆపై ఆస్ట్రేలియన్ కస్టమ్స్ అధికారులకు కూడా ఆమె లేఖను పంపారు . “జరిమానా విధించిన తర్వాత నేను ఒక విధంగా షాక్ అయ్యాను. ఈ చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి . వాస్తవంగా ఆరోజు నా బ్యాగ్‌లో పువ్వులు తీసుకెళ్లనే లేదు. పువ్వులు నా జుట్టుమీద మాత్రమే ఉన్నాయి . అది అందరికీ బహిరంగంగానే కనిపిస్తుంది . దానిని నేను ఏమీ దాచలేదు . కానీ , నా బ్యాగులో మొదట పువ్వులు ఉంచడం వల్ల ఎయిర్ పోర్ట్ లోని స్నిఫర్ డాగ్స్ పసిగట్టాయి . బ్యాగులో ఒకటి లేదా రెండు ఫ్లవర్ బాగాలు ఉండిపోయాయి . దీంతో అక్కడి అధికారులు ఫైన్ వేశారు . 28 రోజుల్లో చెల్లించాలని కోరారు ‘ అని ఆమె చెప్పారు .
మల్లెపూల నిషేధం వెనుక కారణం
ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖను మెయిల్ ద్వారా నవ్య నాయర్ సంప్రదించారు . ‘ జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పాను . జరిమానా మొత్తాన్ని మాఫీ చేయమని కోరాను . వారు మాఫీ చేయకపోతే రూ . 26 వేలు వసూలు చేస్తారని ఒక ఆర్టికల్ లో చదివాను . ప్రస్తుతానికి వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు . మానవతా కోణంలో వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను . జరిమానా చెల్లించాల్సిందే అని కోరితే నాకు వేరే మార్గం లేదు. ఒక దేశ చట్టాన్ని ఎవరైనా సరే పాటించాలి. ‘ అని ఆమె అన్నారు .
నటి ప్రతిస్పందన మరియు లేఖ
ఆస్ట్రేలియాలో ఎందుకు నిషేదం..? బయోసెక్యూరిటీ నియమాల ప్రకారం మల్లెపూలతో పాటు ఇతర మొక్కలు, పూలు, గింజలు, కాయగూరలు, మట్టి, జంతు సంబంధిత ఉత్పత్తులు తీసుకెళ్లినా కూడా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు . వాటి ద్వారా ఆయా క్రిమికీటకాలు తమ దేశంలోకి వ్యాప్తి చెందుతాయని , ఆపై అక్కడి పంటలకు నష్టం కలిగిస్తాయని వారు కనుగొన్నారు .
నవ్య నాయర్ జరిమానా విధించిన విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఆస్ట్రేలియా చట్టాల గురించి అవగాహన పెంచాలని కోరింది. ఈ ఘటన ఆస్ట్రేలియా బయో సెక్యూరిటీ నిబంధనల కఠినతను చూపిస్తుంది.


