
📌 Key Points
- మమితా బైజు గ్రే లాంగ్ గౌన్‌లో మెస్మరైజింగ్ లుక్!
- సింపుల్ అండ్ క్లాసీ స్టైల్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు.
- విజయ్ హీరోగా రూపొందిన ‘జన నాయగన్’లో కీలక పాత్రలో మమిత.
- ప్రేమలు చిత్రం ద్వారా మమితా బైజుకు అద్భుతమైన గుర్తింపు!
మలయాళ నటి మమితా బైజు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు గ్రే కలర్ లాంగ్ గౌన్‌లో మెస్మరైజింగ్ లుక్‌తో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
గ్రే డ్రెస్‌లో మమితా.. క్లాసీ లుక్!
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మమిత బైజు 22 జూన్ 2000 సంవత్సరంలో జన్మించింది. ఈమె ప్రముఖంగా మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 2017లో విడుదలైన సర్వోపరి పాలక్కారన్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది.
ఈమెకు 2024లో విడుదలైన ప్రేమలు చిత్రం ద్వారా అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. ఇక కొంతకాలం క్రితం ఈమె డ్యూడ్ అనే చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది.
‘జన నాయగన్’లో కీలక పాత్రలో మమితా బైజు
ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ విజయ్ హీరోగా రూపొందిన ‘జన నాయగన్’లో కీలక పాత్రలో నటించింది. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో చాలా విషయాలను పంచుకుంటుంది.
అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రే కలర్ లాంగ్ గౌన్‌లో సింపుల్ అండ్ క్లాసీ స్టైల్‌తో కెమెరా ముందు పోజులు ఇస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ఈమె ఈ ఫోటోల్లో భారీ స్థాయిలో అందాలను ఆరబోయకపోయినా, చాలా క్లాస్ లుక్‌లో కనిపించడంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram
మమితా బైజు ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఆమె రాబోయే సినిమాల గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.


