
📌 Key Points
- ప్రేమలు సినిమాతో మమిత బైజుకు యువతలో అద్భుతమైన క్రేజ్ లభించింది.
- సినిమా తర్వాత చాలా మంది నుంచి లవ్ ప్రపోజల్స్ వచ్చాయని మమిత వెల్లడించింది.
- ఆమె పెళ్లి, ప్రపోజల్స్ వ్యవహారాలన్నీ అన్నయ్య మిథున్ చూసుకుంటాడని పేర్కొంది.
- విజయ్ తలపతి కూతురిగా ‘జన నాయగాన్’ సినిమాలో నటించనుంది.
ప్రేమలు సినిమాతో యువతలో క్రేజ్ సంపాదించుకున్న నటి మమిత బైజు.. తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు వచ్చిన లవ్ ప్రపోజల్స్, పెళ్లి వ్యవహారాలన్నీ తన అన్నయ్య చూసుకుంటాడని మమిత వెల్లడించింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రేమలు తర్వాత లవ్ ప్రపోజల్స్
Mamitha Baiju: ప్రేమలు సినిమాతో యూత్ లో యమ క్రేజ్ సంపాదించుకుంది మలయాళ కుట్టి మమిత బైజు(Mamitha Baiju). ఈ ఒక్క సినిమాతో ఆమె చాలా మందికి క్రష్ గా మారిపోయింది. అంతేకాదు, అదే రేంజ్ లో ఆమెకు లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయట. తాజాగా తనకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ గురించి, తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది మమిత. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు మాట్లాడుతూ.. ‘ప్రేమలు సినిమా తర్వాత నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో కాదు.. కొంతమంది నా నంబర్ తెలుసుకొని డైరెక్ట్‌గా మెసేజెస్ చేస్తున్నారు. నాకు వాటిని చదివే టైమ్, ఓపిక లేదు. అందుకే ఆ వ్యవహారాన్నీ మా అన్నయ్య చూసుకుంటున్నాడు.
పెళ్లి వ్యవహారాలు చూసేది అన్నయ్యే!
Battle Of Galwan: తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్ ఖాన్.. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ అప్డేట్..
మమిత కొత్త చిత్రాలు
పేరు మిథున్. మేం క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. నా ప్రతి విషయంలో మా అన్నయ్య ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఏ నిర్ణయమైనా అన్నయ్యను అడిగే తీసుకుంటాను. చివరకు నా పెళ్లి కూడా గురించి కూడా” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది మమిత. ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల ఆమె హీరోయిన్ గా వచ్చిన సినిమా డ్యూడ్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా తరువాత మమిత చేస్తున్న మరో భారీ సినిమా జన నయగాన్. విజయ్ తలపతి హీరోగా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మమిత విజయ్ తలపతి కూతురిగా కనిపించనుంది అని టాక్.
మమిత బైజు తన వ్యక్తిగత విషయాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన అన్నయ్యే పెళ్లి డిసైడ్ చేస్తాడని చెప్పడం విశేషం. ఆమె తదుపరి చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


