|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mamitha Baiju : డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఏం చదువుతుందో తెలుసా? కృతిశెట్టి లాగే..

Published: 22-10-2025, 12:41 AM
Mamitha Baiju : డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఏం చదువుతుందో తెలుసా? కృతిశెట్టి లాగే..

ప్రేమలు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మమిత బైజు, తన చదువు వివరాలను వెల్లడించింది. డ్యూడ్ హీరోయిన్ మమిత సైకాలజీలో డిగ్రీ చదువుతోంది. కృతిశెట్టి లాగే ఆమె కూడా చదువుకు ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం. ఈ ఆర్టికల్‌లో ఆమె విద్యాభ్యాసం గురించి వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

మమిత బైజు ప్రేమలు సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

2

ఆమె తండ్రి డాక్టర్ కాగా, మమితకు మెడిసిన్ చదవాలని ఉండేది.

4

కృతిశెట్టి లాగే మమితా కూడా సైకాలజీ డిగ్రీ పూర్తి చేస్తోంది.

మమిత బైజు విద్యాభ్యాసం

Mamitha Baiju : మలయాళం హీరోయిన్ మమిత బైజు ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా వైరల్ అయిన ఈ భామ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. మమిత బైజు ఇటీవలే ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Mamitha Baiju)

డ్యూడ్ సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించగా తెలుగులో యావరేజ్ గా నిలిచింది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేశారు. డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి తెలిపింది.

డ్యూడ్ హీరోయిన్ మెడిసిన్ కలను వదులుకుంది

మమిత బైజు మాట్లాడుతూ.. మా నాన్న డాక్టర్. నేను కూడా మెడిసిన్ చదవాలి అనుకున్నాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కరోనా వచ్చింది. అప్పటికి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నా. కరోనా సమయంలో బ్రేక్ రావడంతో సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేశా. సినిమాలను ఎక్కువ ఇష్టపడ్డా. అప్పుడు ఆలోచించి సినిమాలే చేస్తాను అని ఇంట్లో ఒప్పించాను. కానీ మొత్తం స్టడీ వదలకూడదు కాబట్టి సైకాలజీ చదువుతున్నాను. థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు ప్రేమలు రిలీజయి హిట్ అయి వరుస ఛాన్సులు వస్తున్నాయి. దాంతో బిజీగా ఉండి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను. మళ్ళీ చదివి సైకాలజీ డిగ్రీ పూర్తి చేస్తాను. త్వరలో పూర్తవుతుంది అని తెలిపింది.

కృతిశెట్టితో మమితా చదువు పోలిక

హీరోయిన్ కృతిశెట్టి కూడా సైకాలజీలో డిగ్రీ చేస్తున్నాను అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కృతి లాగే ఇప్పుడు మమిత బైజు కూడా సైకాలజీలో డిగ్రీ చేస్తుంది.

మొత్తం మీద, మమితా బైజు చదువు పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ఈ వివరాలు తెలియజేస్తున్నాయి. సినీ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ, కృతిశెట్టి లాగే విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఆమె యువతకు ఆదర్శంగా నిలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.