
📌 Key Points
- కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ కోసం బెంగళూరులో ట్రాఫిక్ నిలిపివేశారు.
- గర్భిణి భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వ్యక్తి ట్రాఫిక్ లో చిక్కుకుపోయాడు.
- పోలీసులు వాహనాలను వదలకపోవడంతో ఆగ్రహించి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపాడు.
- వీవీఐపీల భద్రతపై ప్రజల ఆగ్రహం, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ.
బెంగళూరులో కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో, గర్భిణి భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులు వాహనాలను వదలకపోవడంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపాడు. ఈ ఘటన వీవీఐపీల భద్రతపై ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
నాయకుల కాన్వాయ్ లతో ప్రజల ఇబ్బందులు
నాయకులు ఎవరైనా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నామని చెబుతుంటారు. కానీ పదవులు వచ్చిన తరవాత ప్రజాసేవ కంటే ప్రజలను ఇబ్బందిపెట్టే పనులే ఎక్కువ చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్లు బయటకు వెళ్లారంటే మందు నాలుగు వెనక నాలుగు కార్లు ఉండాల్సిందే. ఆ కాన్వాయ్ కోసం గంటల తరబడి ప్రజలు ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సిందే. నాయకుల కాన్వాయ్ లతో ప్రజలు ఎంత ఇబ్బంది పెడతారో తెలిపేలా కర్ణాటకలో ఓ ఘటన చోటు చేసుకుంది. బెంగుళూరులోని ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ ప్రయాణించాల్సి ఉండటంతో, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు దాదాపు అరగంట పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిపివేశారు.
ఆ సమయంలో అక్కడ అండర్ పాస్ నిర్మాణపనులు జరగడంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే ట్రాఫిక్ లో ఓ వ్యక్తి తన గర్భవతి భార్యను ఆస్పత్రి తీసుకువెళుతూ చిక్కుకుపోయాడు. ఎంత సమయం గడుస్తున్నా పోలీసులు వాహనాలను వదలకపోవడంతో ఆ వక్తి తీవ్ర ఆందోళనకు గురై రోడ్డుపై బైటాయించాడు. మేమేం మనుషులం కాదా.. నా భార్య కారులో పురిటినొప్పితో బాధపడుతోందని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవీఐపీల భద్రత కంటే సామాన్యుల ప్రాణాలు, అత్యవసర వైద్య అవసరాలు ముఖ్యం కాదా అని పోలీసులను నిలదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. బెంగళూరు లాంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్న మెట్రో నగరాల్లో కాన్వాయ్ ల కోసం రోడ్లు మూసివేయడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా ఇలా ఇబ్బంది పెట్టడమేంటని మండిపడుతున్నారు.
బెంగళూరులో గవర్నర్ కాన్వాయ్ వివాదం
సామాన్యుడి ఆవేదన, నెటిజన్ల ఆగ్రహం
ఈ ఘటన వీవీఐపీల భద్రత, సామాన్యుల ప్రాణాల విలువపై తీవ్ర చర్చను రేకెత్తించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసేవ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని స్పష్టం చేస్తున్నారు.


