|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Breaking: ఓటీటీలో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఇక రచ్చ రచ్చే!

Published: 12-01-2026, 5:30 AM
Breaking: ఓటీటీలో చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఇక రచ్చ రచ్చే!
  • చిరంజీవి, నయనతార జోడీగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్!
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్!
  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కంటే చిరంజీవి సినిమా చాలా బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు.
  • ఫిబ్రవరి చివరి వారంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్! రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

సంక్రాంతికి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిరు మూవీ!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), నయన తార ( Nayana tara) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu ). ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇవాళ రిలీజ్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్లు పడిపోయాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రావడంతో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే కథ జనాలకు బాగా నచ్చిందట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మొన్న రిలీజ్ అయిన ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ కంటే చాలా బెటర్ అంటున్నారు సినిమా చూసినవాళ్లు. దీంతో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన OTT అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించిన మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu OTT) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న నేపథ్యంలో భారీ ధరకు సొంతం చేసుకుందట జీ5. ఈ సినిమా ఇవాళ రిలీజ్ కాగా ఫిబ్రవరి చివరి వారంలో ఓటీటీలోకి రాబోతున్నట్లు చెబుతున్నారు. అంటే ఈ సినిమా OTTలోకి రావాలంటే ఆరు వారాల సమయం పడుతుంది.

జీ5 లో స్ట్రీమింగ్.. ఎప్పుడో తెలుసా?

ప్రభాస్ సినిమా కంటే చిరంజీవి సినిమా బెటర్ అంటున్నారు!

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి! మెగా ఫ్యాన్స్ కు ఇది నిజంగా పండగే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.