|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే జీరోనా? అసలు నిజం చెప్పిన మానస వారణాసి!

Published: 19-02-2026, 5:05 AM
షాకింగ్: మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే జీరోనా? అసలు నిజం చెప్పిన మానస వారణాసి!
  • మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ ఉండదా? మానస వారణాసి షాకింగ్ నిజాలు!
  • దేవకి నందన వాసుదేవా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మానస వారణాసి.
  • టైటిల్ గెలిచినప్పుడు ఇచ్చే చెక్కు డబ్బులు ఏడాదిపాటు మెయింటెనెన్స్‌కు మాత్రమే!
  • హోటల్, మేకప్, కాస్ట్యూమ్స్ ఖర్చులకే ప్రైజ్ మనీ మొత్తం ఖర్చు అవుతుందన్న మానస.

టాలీవుడ్‌లో మోడల్స్ హవా నడుస్తోంది. మిస్ ఇండియా టైటిల్ గెలిచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మానస వారణాసి సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

మిస్ ఇండియా ప్రైజ్ మనీ వెనుక అసలు నిజం

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే వారిలో చాలామంది మోడలింగ్ రంగం నుండి వస్తుంటారు. అక్కడ అద్భుతమైన స్థాయికి చేరుకున్న తర్వాత అనేకమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే వారిపై ఒక అపోహ కూడా ఉంటుంది. ఆ రంగంలో కొన్ని టైటిల్స్ ను గెలుచుకున్న తర్వాత వారికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి ఉంటుందని, దానితో వారికి విలాసవంతమైన జీవితం కూడా ఆ డబ్బు ద్వారా లభిస్తుందని అపోహ పడుతూ ఉంటారు.

మెయింటెనెన్స్ కోసమే ప్రైజ్ మనీ అంతా!

అలాంటి వాటికి మిస్ ఇండియా టైటిల్ను గెలిచి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి జోష్‌లో కెరియర్ను కొనసాగిస్తున్న మానస వారణాసి క్లారిటీ ఇచ్చింది. ఈ బ్యూటీ 2020లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌ అయ్యింది. మిస్‌ ఇండియా వరల్డ్, మిస్‌ తెలంగాణ 2020 విన్నర్‌గా కూడా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె మొదటగా దేవకి నందన వాసుదేవా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. తాజాగా కపుల్ ఫ్రెండ్లీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈ బ్యూటీ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ మరియు కొన్ని టైటిల్స్ గెలుపొందినప్పుడు జరిగే పరిస్థితుల గురించి తెలియజేసింది.

సినీ ఇండస్ట్రీలో మానస వారణాసి సంచలనాలు

మానస వారణాసి మాట్లాడుతూ… “టైటిల్ గెలిచినప్పుడు స్టేజ్ పై మాకు చెక్ అందిస్తారు. కానీ అందులో నుండి మాకు ఒక్క రూపాయి కూడా మాకు అందదు. వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం సంవత్సరం పాటు మా మెయింటెనెన్స్ కి ఉపయోగిస్తారు. హోటల్స్ లలో అయ్యే ఖర్చుకు అలాగే మేకప్‌, కాస్ట్యూమ్స్, ట్రావెలింగ్‌, జిమ్‌, ప్రోగ్రామ్స్, సర్వీసెస్‌ వంటి వాటికి మాకు ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బునే ఖర్చు చేస్తారు. దానితో మేము టైటిల్ విన్నర్ అయ్యాక గెలుపొందిన దాంట్లో మాకు ఒక్క రూపాయి కూడా మిగలదు” అని ఈమె క్లారిటీ ఇచ్చింది.

మానస వారణాసి చెప్పిన ఈ షాకింగ్ విషయాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నా డబ్బులు చేతికి రాకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.