
మంచు కుటుంబంలోని గొడవలు తెలుగు సినీ ప్రేక్షకులకు తెలిసినవే. అయితే, ఇటీవల మంచు విష్ణు, మనోజ్ మధ్య సయోధ్య కనిపిస్తోంది. ‘మిరాయ్’ సినిమా విడుదలతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయ్యింది.
Key Points
మంచు బ్రదర్స్ మధ్య గొడవలు ఇటీవల తగ్గుముఖం పట్టాయి.
మనోజ్ నటించిన 'మిరాయ్' సినిమాకు విష్ణు శుభాకాంక్షలు తెలిపారు.
విష్ణు అభినందనలకు మనోజ్ స్పందించడం చర్చనీయాంశం అయ్యింది.
సోషల్ మీడియాలో కనిపించే సంకేతాల ద్వారా అన్నదమ్ములు కలిసిపోయారని అనుమానం.
మంచు కుటుంబంలోని గొడవలు
మంచు వారింట గొడవల గురించి అందరికి తెలిసిందే. అన్నదమ్ముల మధ్య కారణం ఏంటో కూడా తెలియని గొడవలు చాలా జరిగాయి. ఆస్తుల గురించి గొడవ అని ప్రాచారం జరుగుతున్నా. దానిపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. రెండు వర్గాల నుంచి రకరకాల వాదనలు ఉన్నాయి. ఈక్రమంలో మోహన్ బాబు కూడా పెద్ద కొడుకు విష్ణువైపు నిలబడటంతో మనోజ్ ఒంటరి అయిపోయాడు. ఇక మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచే ఈ గొడవలు పెద్దవి అయ్యాయని టాక్. ఈక్రమంలో ఓ రెండు నెలలు మంచువారింట ఉద్రిక్తలు వైరల్ వార్తలు అయ్యాయి. మోహన్ బాబు మీడియాపై చేసిన దాడి కూడా సంచలనంగా మారింది. ఇక ఆతరువాత మనోజ్ విడిగా ఉంటంతో ఉద్రిక్తలు సర్ధుమణిగాయి. కాని అప్పుడప్పుడు మంచువారి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈమధ్య కాలంలో మంచు బ్రదర్స్ కలిసిపోయినట్టు అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా కొన్ని సంకేతాలు ఇలానే కనిపిస్తున్నాయి. ఆమధ్య మంచు విష్ణు కన్నప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు మొదట తెలియకుండా సెటైర్లు వేసిన మంచు మనోజ్, ఆతరువాత ఆ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అప్పుడే అందరికి ఈ విషయంలో కాస్త డౌట్ వచ్చింది. ఇక తాజాగా మంచు మనోజ్ విలన్ గా నటించిన మిరాయ్ సినిమా టీమ్ కు మంచు విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పడం, దానికి మనోజ్ రిప్లై ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
సెప్టెంబర్ 12న విడుదలైన యాక్షన్-ఫాంటసీ థ్రిల్లర్ ‘మిరాయ్’ తొలి షో నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. భారీ విజువల్స్, గ్రిప్పింగ్ కథనంతో సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాలలో విలన్ పాత్ర ఒకటి. మంచు మనోజ్ పోషించిన ‘బ్లాక్ స్వోర్డ్’ పాత్ర అందరిని ఆకట్టుకుంటోంది. అతని పాత్రలోని స్టైల్, పవర్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇదే సందర్భంగా మూవీపై సినీ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో మంచు విష్ణు కూడా మిరాయ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ, “మిరాయ్ విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్” అంటూ విష్ణు పోస్ట్ చేశారు.
Wishing all the best for #Mirai . God speed to the entire team.
మిరాయ్ సినిమా విజయం
— Vishnu Manchu (@iVishnuManchu) September 12, 2025
విష్ణు అభినందనలపై మంచు మనోజ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు:
Love and respect always… From team MIRAI ”
అంటూ తాను పోషించిన బ్లాక్ స్వోర్డ్ పాత్రను గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
అన్నదమ్ముల మధ్య సయోధ్య?
Thank you soo much anna, From team #Mirai alias #BlackSword https://t.co/JwG02gqPUo
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025
గొడవల తరువాత మంచు బ్రదర్స్ ఇలా సోషల్ మీడియాలో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయడం తో మంచు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గతంలో వీరిద్దరి మధ్య గల మైనర్ డిఫరెన్సుల గురించి వార్తలు వచ్చినప్పటికీ, ఈ మార్పుతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో “మంచు బ్రదర్స్ మళ్లీ కలిసారా?” అనే చర్చ కూడా ప్రారంభమైంది.
మిరాయ్ సినిమాలో మనోజ్ బ్లాక్ స్వోర్డ్ పాత్రలో కనిపించగా, రితికా నాయక్, శ్రియా శరన్, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం గౌర హరి అందించారు.మొత్తానికి, ‘మిరాయ్’ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం, మంచు విష్ణు స్వయంగా అభినందించడం, మనోజ్ స్పందన – అన్నీ కలసి మంచు కుటుంబం చుట్టూ మరోసారి చర్చను రేపాయి.
మంచు విష్ణు, మనోజ్ మధ్య సయోధ్య ఏర్పడిందని సూచించే సంఘటన ఇది. ‘మిరాయ్’ సినిమా విజయం ఈ కుటుంబానికి కొత్త ఆరంభానికి దారితీస్తుందేమో చూడాలి.


