
మంచు ఫ్యామిలీలోని ఆస్తి వివాదం గత కొన్ని కాలంగా కొనసాగుతోంది. మంచు మనోజ్ మరియు మంచు విష్ణుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది. తాజాగా, మంచు విష్ణు చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Key Points
మంచు ఫ్యామిలీలోని ఆస్తి వివాదం మరింత తీవ్రతరమైంది.
మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య సోషల్ మీడియా వార్.
మంచు విష్ణు తన తమ్ముడికి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ట్వీట్ చేశాడు.
నెటిజన్లు విష్ణు పోస్ట్‌ను వివిధ కోణాలలో విశ్లేషిస్తున్నారు.
మంచు ఫ్యామిలీ వివాదం: ఒక పూర్తి చరిత్ర
గత కొద్ది కాలంగా మంచు ఫ్యామిలీలో ఆస్తికి సంబంధించిన గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్, మంచు విష్ణు ఇద్దరికి సోషల్ మీడియాలో వార్ చేసుకుంటున్నారు. మోహన్ బాబు ఇంట్లోంచి గెంటేశారని గతంలో మంచు మనోజ్ కన్నీరు పెట్టుకున్నాడు. అంతేకాకుండా తన కూతురిని తనకు అప్పగించాలని గేటు ముందు ధర్నా కూడా చేసి సంచలనం సృష్టించారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. మోహన్ బాబు(Mohan Babu), మంచు మనోజ్(Manchu Manoj) ఒకరిపై ఒకరు పోలీస్ కేసు కూడా పెట్టుకున్నారు. కోర్టులు, కలెక్టర్ అఫీసుల చుట్టూ తిరిగారు. దీంతో మంచు ఫ్యామిలీ వివాదం కాస్త వీధికి ఎక్కింది.
మంచు విష్ణు ట్వీట్: కొత్త మలుపు
కొద్ది కాలానికి మోహన్ బాబు ఇద్దరు కొడుకులకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. మంచు ఫ్యామిలీ పూర్తిగా చిన్న కొడుకు దూరం అయిపోయాడు. ఒక ఇండైరెక్ట్‌గా కౌంటర్లు వేసుకుంటూ పోస్టులు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ నటించిన మల్టీ స్టారర్ భైరవం, మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ పోటాపోటీగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కానీ అలా జరగలేదు ‘భైరవం’ ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక గత కొద్ది రోజుల నుంచి మనోజ్, విష్ణు సైలెంట్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మంచు విష్ణు ఓ ట్వీట్ చేశాడు.
నెటిజన్ల ప్రతిచర్యలు: వివిధ అభిప్రాయాలు
తమ్ముడికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ‘‘జీవితం విలువైనదే అయినప్పటికీ అనూహ్యమైనది. కొన్ని సంఘటనలు ఒక్క క్షణాన్ని కూడా తేలికగా తీసుకోకూడదని మనకు గుర్తు చేస్తాయి. ప్రతిరోజూ గౌరవిద్దాం, కృతజ్ఞతను వ్యక్తపరుద్దాం, మన ప్రియమైన వారిని దగ్గరగా ఉంచుకుందాం. మనకు వీలైన చోటల్లా సానుకూలతను వ్యాప్తి చేద్దాం. బలంగా ఉండండి, కృతజ్ఞతతో ఉండండి’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్చ చూసిన నెటిజన్లు మంచు మనోజ్‌ను దగ్గరికి తీసుకుంటానని విష్ణు హింట్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ పోస్ట్ చూసి కొందరు అంతలా కొట్టుకుని కలిసిపోతున్నారా? అని షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం మంచి నిర్ణయం అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
మంచు విష్ణు చేసిన ట్వీట్‌తో మంచు ఫ్యామిలీ వివాదంలో కొత్త మలుపు ఏర్పడింది. విష్ణు తన తమ్ముడితో సమాధానం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది ఇంకా తెలియదు. ఈ విషయంపై భవిష్యత్తులో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.


