
📌 Key Points
- మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణ ఓణీల వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సందడి.
- వేడుకకు హాజరైన మంచు మనోజ్.. మేనకోడలిని దగ్గరుండి చూసుకున్నాడు.
- మంచు విష్ణు, మోహన్ బాబు, వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ వేడుకకు హాజరు కాలేదు.
- మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ వ్యవహారం! మంచు లక్ష్మి కూతురి ఓణీల వేడుకకు మోహన్ బాబు, విష్ణు గైర్హాజరు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఏం జరుగుతోంది?
లక్ష్మి కూతురి వేడుకలో మనోజ్ సందడి
Manchu Family : ఇటీవల కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ వర్సెస్ మంచు మనోజ్ అన్నట్టు ఈ గొడవలు సాగాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు కంప్లైట్స్ ఇచ్చేదాకా కూడా ఈ గొడవలు వెళ్లాయి. మంచు మనోజ్ తో మంచు ఫ్యామిలీ ఎవరూ మాట్లాడట్లేదని, మనోజ్ ఒకడే తన భార్య, పిల్లలతో సపరేట్ గా ఉంటున్నాడని వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా మరోసారి మంచు ఫ్యామిలిలో విబేధాలు బయట పడ్డాయని అంటున్నారు. ఇటీవల మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ చేసారు. కేవలం బంధువులు, సన్నిహితుల మధ్యే ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
మోహన్ బాబు, విష్ణు దూరం వెనుక అసలు కారణమేంటి?
ఈ వీడియోలలో మంచు మనోజ్ హైలెట్ గా నిలిచాడు. మేనకోడలుని పల్లకి ఎక్కించి తీసుకొచ్చి, దగ్గరుండి చూసుకున్నాడు. అయితే ఈ వేడుకల్లో ఎక్కడా మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ బాబు భార్య, విష్ణు భార్య కానీ ఎవ్వరూ కనిపించలేదు. మనవరాలి ఫంక్షన్ కి మోహన్ బాబు ఎందుకు రాలేదు, మేనకోడలు ఫంక్షన్ కి విష్ణు ఎందుకు రాలేదు అని చర్చ జరుగుతుంది.
మంచు ఫ్యామిలీలో మనస్పర్థలు నిజమేనా?
ఇక మంచు ఫ్యామిలిలో మొత్తానికి తెగతెంపులు జరిగాయా? లేక మనోజ్ వచ్చాడని వాళ్ళు వెళ్లలేదా? మంచు లక్ష్మి పిలవలేదా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మొదట్నుంచి మంచు లక్ష్మి మనోజ్ కి సపోర్ట్ గానే ఉంది. ఇటీవల జరిగిన గొడవల్లో కూడా లక్ష్మి మనోజ్ వైపే ఉంది. మనోజ్ కూడా అక్క అంటే ప్రాణం ఇస్తాడు. అందుకే మేనకోడలు ఫంక్షన్ లో అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. మనోజ్ వచ్చినా మిగతా మంచు ఫ్యామిలీ ఎవరూ రాకపోవడంతో విద్య నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ చర్చగా మారింది.
మొత్తానికి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


