|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాన్న గారితో అమితాబ్ పీకూ లాంటి సినిమా చేయాలను ఉంది.. మనోజ్ సలహాలు తీసుకున్నా.. మంచు లక్ష్మి కామెంట్స్

Published: 16-09-2025, 10:52 AM
నాన్న గారితో అమితాబ్ పీకూ లాంటి సినిమా చేయాలను ఉంది.. మనోజ్ సలహాలు తీసుకున్నా.. మంచు లక్ష్మి కామెంట్స్

మంచు లక్ష్మి నటించిన ‘దక్ష – ది డెడ్లీ కాన్సిపిరసీ’ సినిమా ప్రెస్ మీట్ లో ఆమె తన తండ్రి మంచు మోహన్ బాబు, తమ్ముడు మనోజ్ తో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకుంది. అమితాబ్ బచ్చన్ మరియు పీకూ లాంటి సినిమా చేయాలనే ఆమె కోరికను వెల్లడించింది.

Key Points

1

మంచు లక్ష్మి తండ్రి మంచు మోహన్ బాబుతో కలిసి 'దక్ష' సినిమాలో నటించారు.

2

మంచు మనోజ్ సినిమాకు సలహాలు ఇచ్చారు, ఆయన నటనను లక్ష్మి ప్రశంసించారు.

4

'దక్ష – ది డెడ్లీ కాన్సిపిరసీ' సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.

‘దక్ష’ సినిమా విడుదలకు సిద్ధం

మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా నటించిన దక్ష సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ఈ నెల 19న ఈ దక్ష వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా రీసెంట్‌గా దక్ష ది డెడ్‌లీ కాన్సిపిరసీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది. ఇప్పుడు మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మంచు మనోజ్ సలహాలు, మద్దతు

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “దక్ష కథను నా దగ్గరకు నాన్న గారు తీసుకొచ్చారు. ఆయనే ఈ కథను తీసుకొచ్చారా అనేది మొదట్లో నమ్మలేకపోయాను. ప్రతి చిత్రంతో మనకొక సొంత టీమ్ తయారవుతుంది. మహేశ్, జెమినీ సురేష్ వంటి కో ఆర్టిస్టులతో మాకొక కొత్త టీమ్ ఫార్మ్ అయ్యింది” అని అన్నారు.

“దక్ష సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇది తమ సినిమా అనుకునే నటించారు. రంగస్థలం మహేశ్ అయితే ప్రమోషన్స్ గురించి ఎలా చేయాలో చెప్పేవాడు. ఈ చిత్రంలో నాన్న గారి ఇమేజ్‌కు తగినట్లు పర్‌ఫెక్ట్ క్యారెక్టర్ ఉంది. అందుకే ఆయనను అడిగాం” అని మంచు లక్ష్మి తెలిపారు.

“సముద్ర ఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా.. ఇలా పాన్ ఇండియా వైజ్ చూస్తే ప్రతి భాష నుంచి పేరున్న ఆర్టిస్టులు మా చిత్రంలో నటించారు. నాన్న గారి తర్వాత నన్ను అంత బాగా చూసుకునేది మనోజ్. అతను సినిమా చేయనప్పుడు ఇలాంటి మంచి ఆర్టిస్ట్ స్క్రీన్ మీద మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడు అని ఒంటరిగా బాధపడ్డాను” అని తమ్ముడి మీద ప్రేమను పంచుకున్నారు మంచు లక్ష్మీ.

అమితాబ్-పీకూ లాంటి సినిమా కోరిక

“మనోజ్ హీరోగానే కాదు విలన్ గానూ మెప్పించగలడు, కామెడీ చేయగలడు. వర్సటైల్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. దక్ష సినిమాకు మనోజ్ ఇచ్చిన సజెషన్స్‌ను తీసుకున్నాను. ఎందుకంటే మనోజ్‌కు ఫిలిం మేకింగ్ మీద, ప్రతి క్రాఫ్ట్ మీద పట్టుంది. నాన్న గారితో అమితాబ్ పీకూ లాంటి మూవీ చేయాలని ఉంది” అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

“నటిగా నా ప్రయాణాన్ని ఆపను. తమిళం, మలయాళం లో కూడా నటించాను. నా దగ్గరకు వచ్చే ప్రాజెక్ట్స్ ముందు నటిగా వచ్చి, ఆ తర్వాత ప్రొడ్యూస్ చేయమని అడుగుతున్నారు. ప్రొడక్షన్ అంత ఈజీ కాదు. మా దక్ష చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ వాళ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కన్నప్ప, మిరాయ్ తర్వాత వాళ్లకు మా సినిమా హ్యాట్రిక్ అవ్వాలి” అని మంచు లక్ష్మి వెల్లడించారు.

మంచు లక్ష్మి తన తండ్రితో కలిసి నటించిన ‘దక్ష’ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలియజేసింది. మనోజ్ సలహాలు సినిమాకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.