|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘పుష్ప’ డైలాగ్ నాదే.. మంచు లక్ష్మి సంచలన ప్రకటన! వైరల్ కామెంట్స్!

Published: 09-03-2026, 9:35 PM
షాకింగ్: 'పుష్ప' డైలాగ్ నాదే.. మంచు లక్ష్మి సంచలన ప్రకటన! వైరల్ కామెంట్స్!
  • మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు: ‘పుష్ప’ డైలాగ్ నాదేనన్న మంచు లక్ష్మి!
  • లేచింది మహిళా లోకం ఈవెంట్లో మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్.
  • ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ డైలాగ్ తొలుత వాడింది నేనేనన్న మంచు లక్ష్మి.
  • పాత వీడియోలు చెక్ చేసుకోండి.. నిజం తెలుస్తుందన్న మంచు లక్ష్మి.

టాలీవుడ్ లో మంచు లక్ష్మి ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటారు. ఈసారి ఏకంగా పుష్ప సినిమా డైలాగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందో చూద్దాం!

పుష్ప డైలాగ్ పై మంచు లక్ష్మి కామెంట్స్

Manchu Lakshmi: టాలీవుడ్ స్టార్ బ్యూటీ మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఏది మాట్లాడినా వైరల్ అవుతూనే ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ కలిపి ఆమె మాట్లాడే మాటలు భలేగా ఉంటాయి. అందుకే, ఎప్పుడు మీమ్స్ లో ట్రెండ్ అవుతానే ఉంటారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కానీ, ఈసారి ఏకంగా బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప సినిమా గురించి ఆమె మాట్లాడింది.

వైరల్ అవుతున్న పాత వీడియో

రీసెంట్ గా ఆమె లేచింది మహిళా లోకం అనే సినిమా ఈవెంట్ లో పాల్గొంది. మహిళా దినోత్సవ సందర్బంగా ఈ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ.. ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ అనే డైలాగ్ వాడింది నేనే. ఆ డైలాగ్ నాదే. కావాలంటే పాత వీడియోలు చెక్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చింది. దాంతో, ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

నిజానికి, మంచు లక్ష్మి చెప్పింది నిజమే. చాలా కాలం క్రితమే మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను ఫ్లవర్ అనుకుంటారు కాదు నేను ఫైర్ అంటూ తన వ్యక్తిత్వం గురించి చెప్పుకుంటూ ఆ డైలాగ్ ను వాడింది. ఇప్పుడు మరోసారి ఆ డైలాగ్స్ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా తాజాగా డైలాగ్స్ తో మరోసారి వైరల్ అవుతోంది మంచు లక్ష్మి.

మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.