|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బ్రేకింగ్! బాలయ్య సినిమాలో మంచు మనోజ్.. మాస్ వార్ షురూ! ఫ్యాన్స్ కి పూనకాలు!

Published: 20-05-2026, 4:45 AM
బిగ్ బ్రేకింగ్! బాలయ్య సినిమాలో మంచు మనోజ్.. మాస్ వార్ షురూ! ఫ్యాన్స్ కి పూనకాలు!
  • మంచు మనోజ్ రీ-ఎంట్రీలో బాలయ్యతో భారీ ప్రాజెక్ట్. ఫ్యాన్స్ లో ఉత్సాహం.
  • NBK111లో మనోజ్ కీలక పాత్రకు అధికారిక ప్రకటన. గోపీచంద్ మలినేని ట్వీట్.
  • మనోజ్ పుట్టినరోజున వచ్చిన ఈ అప్డేట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్.
  • బాలయ్య వర్సెస్ మనోజ్ మరోసారి చూడాలని ఫ్యాన్స్ వెయిటింగ్.

టాలీవుడ్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్! బాలయ్య, మంచు మనోజ్ కాంబినేషన్ లో రాబోతున్న NBK111పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మనోజ్ పుట్టినరోజున డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మాస్ వార్ కి సిద్ధం కండి!

NBK111లో మనోజ్.. అధికారిక ప్రకటనతో షాక్!

Manchu Manoj : మంచు మనోజ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. మిరాయి సినిమాలో మెయిన్ విలన్ గా అదరగొట్టాడు మనోజ్. నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

బాలయ్య వర్సెస్ మనోజ్.. మాస్ వార్ కి రంగం సిద్ధం!

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంలో NBK 111 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతం. ఈ సినిమాలో మనోజ్ నటించబోతున్నట్టు బర్త్ డే విశేష్ చెప్తూ అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ గోపీచంద్. మనోజ్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. మీ శక్తి మీ చుట్టూ ఉన్న ప్రతి ప్రదేశాన్ని ప్రకాశవంతం చేయడం ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తుంది. ముందు ముందు ఏం జరగబోతోందో చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను అని సినిమాపై, మనోజ్ పాత్రపై హైప్ పెంచారు.

విలనా? కీలక పాత్రనా? సస్పెన్స్ పీక్స్!

దీంతో మనోజ్ వర్సెస్ బాలకృష్ణ అన్నట్టు ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి మనోజ్ బాలయ్య సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడా లేదా ఏదైనా కీలక పాత్రలో నటిస్తున్నాడా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. అయితే గతంలోనే బాలకృష్ణ – మనోజ్ కలిసి నటించారు. ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాలో మనోజ్ – బాలయ్య కలిసి నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఇద్దరి పర్ఫార్మెన్స్ లు మాత్రం అదిరిపోతాయి.

బాలయ్య, మనోజ్ కాంబోలో రాబోతున్న NBK111 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో మనోజ్ పాత్ర ఏమిటో చూడాలంటే వేచి చూడాలి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.