|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంచు మనోజ్ విధ్వంసం: ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ తో షాకింగ్ రీఎంట్రీ!

Published: 26-01-2026, 4:05 AM
మంచు మనోజ్ విధ్వంసం: 'డేవిడ్ రెడ్డి' ఫస్ట్ లుక్ తో షాకింగ్ రీఎంట్రీ!
  • మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ విడుదల: రిపబ్లిక్ డే కానుక!
  • గంభీరమైన లుక్‌లో మంచు మనోజ్: ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్!
  • హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాణం
  • ‘నాలో ఒక కొత్త కోణం’ అంటూ మనోజ్ పవర్ ఫుల్ డైలాగ్

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు మనోజ్ తన కొత్త సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ‘డేవిడ్ రెడ్డి’ సినిమాతో మనోజ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం అదిరిపోయింది!

రిపబ్లిక్ డే కానుకగా ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) ఇప్పుడు తన కొత్త సినిమాతో పవర్‌ఫుల్ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘డేవిడ్ రెడ్డి’(Devid Reddy). ఈ సినిమాకు హనుమ రెడ్డి యక్కంటి(Hanuma Reddy Yakkanti) దర్శకత్వం వహిస్తుండగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మొటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది. అయితే తాజాగా నేడు జనవరి 26, 2026 న రిపబ్లిక్ డే సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా నుంచి మంచు మనోజ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నాలో ఒక కొత్త కోణం.. రా, రూత్ లెస్, క్షమించలేని’ అనే క్యాప్షన్ జోడించారు. ఇక పోస్టర్‌లో మంచు మంనోజ్ బాడీ అంతా నల్లటి మసి పూసుకొని గంభీరమైన లుక్‌లో దర్శనమిచ్చాడు. భుజంపైన ఇనప తీగలతో ఉన్న కర్రను పట్టుకొని చాలా కోపంగా చూస్తున్నాడు. మొత్తానికి ఈ పోస్టర్ భయపెట్టించేలా, గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

భయపెట్టే లుక్‌లో మంచు మనోజ్

పవర్ ఫుల్ డైలాగ్‌తో అంచనాలు పెంచేసిన మనోజ్

మొత్తానికి మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.