|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంచు మనోజ్ విధ్వంసం: ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ అప్డేట్ తో టాలీవుడ్ షేక్!

Published: 25-01-2026, 1:35 AM
మంచు మనోజ్ విధ్వంసం: 'డేవిడ్ రెడ్డి' ఫస్ట్ లుక్ అప్డేట్ తో టాలీవుడ్ షేక్!
  • మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ జనవరి 26న విడుదల – మాస్ ట్రీట్ ఖాయం!
  • హనుమ రెడ్డి దర్శకత్వం, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌లో భారీగా నిర్మాణం!
  • కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం – సినిమాకు హైప్ క్రియేట్!
  • వైల్డ్ పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన మనోజ్ – ఈసారి వేట మామూలుగా ఉండదు!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి ‘డేవిడ్ రెడ్డి’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఇక రచ్చ షురూ!

మనోజ్ రీఎంట్రీతో టాలీవుడ్ హీటెక్కింది!

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) ఇప్పుడు తన కొత్త సినిమాతో పవర్‌ఫుల్ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘డేవిడ్ రెడ్డి’(Devid Reddy). ఈ సినిమాకు హనుమ రెడ్డి యక్కంటి(Hanuma Reddy Yakkanti) దర్శకత్వం వహిస్తుండగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మొటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు.

‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?

అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడగా, తాజాగా మనోజ్ చేసిన ప్రకటన అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. జనవరి 26, 2026 న రిపబ్లిక్ డే సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మనోజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈమేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘క్రూరమైన యుగం రేపు ఉదయం 11:11 గంటలకు ప్రారంభమవుతుంది.

రవి బస్రూర్ సంగీతం.. అంచనాలు ఆకాశాన్నంటేలా!

“రూత్‌లెస్” ఉదయం 11:11 గంటలకు, “బ్రూటల్” సాయంత్రం 4:44 గంటలకు స్టార్ట్ కాబోతుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో ముళ్లతీగలతో ఉన్న కర్రపై మొత్తం రక్తం చిందుతూ వైల్డ్‌గా కనిపించింది. కాగా ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, ఈసారి మరింత రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

‘డేవిడ్ రెడ్డి’ మూవీతో మంచు మనోజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.