|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు శిరీష్ పెళ్లి వేడుక: గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడ? వేడుక వివరాలు లీక్!

Published: 26-02-2026, 12:05 PM
అల్లు శిరీష్ పెళ్లి వేడుక: గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడ? వేడుక వివరాలు లీక్!
  • మార్చి 6న అల్లు శిరీష్, నైనిక రెడ్డి వివాహం.
  • మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో గ్రాండ్ రిసెప్షన్.
  • టాలీవుడ్ ప్రముఖులకు రిసెప్షన్‌కు ఆహ్వానం.
  • కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం.

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్, నైనిక రెడ్డిల వివాహం మార్చి 6న జరగనుంది. దీనికి ముందు, మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

అల్లు శిరీష్ – నైనిక వివాహం ఎప్పుడు?

Allu Sirish Nainika wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ నటి రష్మిక మందన్న ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు .దీంతో ఈ పెళ్లి ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి మర్చిపోకముందే మరొక హీరో పెళ్లి సందడి మొదలైంది. అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది అక్టోబర్ 31న అల్లు శిరీష్ నైనిక రెడ్డి అనే అమ్మాయితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక ఈ జంట మార్చి ఆరో తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారు. అల్లు కుటుంబంలో శిరీష్ పెళ్లి చివరి పెళ్లి కావడంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు కూడా అందాయని తెలుస్తోంది. మరోవైపు అల్లు శిరీష్ గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ ఇవ్వడం అల్లు అర్జున్ సైతం అల్లు శిరీష్ నైనికకు కాక్ టైల్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అల్లు శిరీష్ నైనిక మార్చి ఆరవ తేదీ పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని వెల్లడించారు. కానీ వీరి పెళ్లి వేదిక ఎక్కడ ఏంటి అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు అయితే తాజాగా అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈయన మార్చి 6వ తేదీ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో మార్చి రెండవ తేదీ అల్లు స్టూడియోస్ లో టాలీవుడ్ సెలబ్రిటీలతో ఫ్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.

రిసెప్షన్ వేదిక ఎక్కడ?

Nayanika & I are having an intimate wedding with family & friends on 6th March.

We are excited to celebrate our Pre Wedding Celebrations with the Telugu film industry prestigiously at Allu Studios on the 2nd March.

— Allu Sirish (@AlluSirish) February 26, 2026

టాలీవుడ్ సెలబ్రిటీల సందడి

ఇలా పెళ్లికి ముందుగానే అల్లు శిరీష్ నైనికల ఫ్రీ వెడ్డింగ్ రిసెప్షన్ పూర్తి కావడంతో మార్చ్ ఆరో తేదీ చేసుకోబోయే పెళ్లి వేడుకలో భాగంగా కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారని తెలియజేశారు. మరి వీరి వెడ్డింగ్ రిసెప్షన్ అల్లు స్టూడియోస్ లో జరగగా పెళ్లి కూడా అక్కడే జరుగుతుందా? లేదంటే ఏదైనా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శిరీష్ పెళ్లి పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ సైతం శిరీష్ పెళ్లి కోసం ఒక వారం రోజులపాటు తన సినిమా షూటింగుకు బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

అల్లు శిరీష్, నైనిక వివాహ వేడుక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రిసెప్షన్ తర్వాత, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.