|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Manoj : నాకు బతకాలని లేదు.. ఈ జీవితం చాలు అనుకున్నా.. మా అక్క నన్ను పట్టుకొని ఏడ్చేసింది..

Published: 10-09-2025, 5:50 AM
Manchu Manoj : నాకు బతకాలని లేదు.. ఈ జీవితం చాలు అనుకున్నా.. మా అక్క నన్ను పట్టుకొని ఏడ్చేసింది..

తెలుగు సినీ నటుడు మంచు మనోజ్ తన జీవితంలోని ఒక కష్టకాలం గురించి బహిరంగంగా మాట్లాడాడు. తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఆయన, ఆత్మహత్య ఆలోచనలను కూడా ఎదుర్కొన్నట్లు తెలిపాడు. అయితే, తన కుటుంబం మరియు థెరపీ సహాయంతో ఆయన కోలుకున్నాడు.

Key Points

1

మంచు మనోజ్ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

2

ఆయనకు బతకాలని లేదని, జీవితం చాలు అనిపించింది.

4

థెరపీ ద్వారా ఆయన మానసిక స్థితి మెరుగైంది.

మనోజ్ యొక్క మానసిక పోరాటం

Manchu Manoj : మంచు మనోజ్ మధ్యలో కొన్నాళ్ళు పర్సనల్ సమస్యలతో సినిమాలకు దూరంగా ఉండగా ఇప్పుడిప్పుడే మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల భైరవం సినిమాతో మెప్పించగా ఇప్పుడు మిరాయ్‌ సినిమాలో విలన్ గా రాబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచు మనోజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒకానొక సమయంలో ఈ జీవితం చాలు అనుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.(Manchu Manoj)

మంచు మనోజ్ మాట్లాడుతూ.. మా వైఫ్, మా అక్క, మా అమ్మ నాకు అన్ని సమయాల్లో సపోర్ట్ గా నిలబడ్డారు. నేను బాధపడితే నా క్లోజ్ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తాను. ఒకానొక సమయంలో నేను బాధపడుతూ ఎవరితో ఏమి మాట్లాడకుండా నాకు ఈ జీవితం చాలు అనుకున్నాను. మా అక్క(మంచు లక్ష్మి) నా గురించి ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అనుకొని భయపడింది. దాంతో అక్క నన్ను థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళమంది. నేను అక్క మీద అరిచేసాను. నేను బాధపడుతుంటే పిచ్చి, సైకో అనుకుంటున్నావా థెరపీ దగ్గరకు వెళ్ళమంటున్నావు అని ఫైర్ అయ్యాను అక్క మీద. ఆ సమయంలో నాకు బతకాలని లేదు. లోకం అంతా తప్పు, ఎవరూ కరెక్ట్ గా లేరు అనిపించేది.

అక్క మంచు లక్ష్మి మద్దతు

Also See : Puri Sethupathi Film : విజయ్ సేతుపతి సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టిన పూరి జగన్నాధ్.. ఫొటోలు..

థెరపీ ద్వారా కోలుకున్న మనోజ్

ఒకసారి చిన్న రియలైజ్ అయ్యాను. నేను ఏమన్నా చేసుకుంటే నా ఫ్యామిలీ ఏంటి అనుకున్నాను. ఒకరోజు మా అక్క దగ్గరికి వెళ్లి నాకు బతకాలని ఉంది మొన్న థెరపీ అన్నావుగా ఏంటో చెప్పు అని అడిగితే నన్ను పట్టుకొని ఏడ్చేసింది. అప్పుడు తనే ఓ థెరపిస్ట్ ని తీసుకొచ్చింది. తను నాకు ట్రీట్మెంట్ చేసింది. అప్పుడు అన్ని రియలైజ్ అయ్యాను. అందుకే ఎన్ని బాధలు ఉన్న సంతోషంగా హ్యాపీగా ఉంటాను అందరితో. ఏ రిలేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా థెరపీ తీసుకోండి అని తెలిపారు.

మంచు మనోజ్ తన అనుభవాలను పంచుకోవడం ద్వారా, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేశాడు. కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, సహాయం కోసం ముందుకు రావడం చాలా ముఖ్యం అని ఆయన సందేశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.