|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Manoj: సతీమణికి మంచు మనోజ్ స్పెషల్ విషెస్.. వీడియో వైరల్

Published: 05-10-2025, 6:35 PM
Manchu Manoj: సతీమణికి మంచు మనోజ్ స్పెషల్ విషెస్.. వీడియో వైరల్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనిక పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తన జీవితంలో ఆమె పాత్రను కొనియాడుతూ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

2

మౌనికపై ప్రశంసలు కురిపిస్తూ, తన జీవితంలో ఆమె ప్రాధాన్యతను వివరించారు.

4

మిరాయ్ సినిమా విజయంతో మనోజ్ ఈ ఏడాది గట్టి కమ్ ‌బ్యాక్ ఇచ్చారు.

మనోజ్ సతీమణికి ప్రత్యేక శుభాకాంక్షలు

టాలీవుడ్ హీరో మంచు మనజ్ ఇటీవలే మిరాయ్ ‌ మూవీతో సూపర్ హిట్ ‌ ను తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ చిత్రంలో విలన్ ‌ గా అభిమానులను ‍ అలరించారు . హనుమాన్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ ‌ బస్టర్ ‌ గా నిలిచింది . ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది . ఈ ఏడాది గట్టిగా కమ్ ‌ బ్యాక్ ‌ ఇచ్చాడు మంచు మనోజ్ . భైరవం తర్వాత మిరాయ్ ‌ మూవీతో ఆకట్టుకున్నారు .

ఇదిలా ఉంచితే మంచు మనోజ్ ‌ 2023 లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే . నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక ను పెళ్లాడారు . తాజాగా అక్టోబర్ 4 న తన సతీమణి మౌనిక పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు మంచు మనోజ్ . ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపించారు . అంతేకాకుండా తనతో కేక్ కట్ ‌ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు . దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు .

మౌనికపై మంచు మనోజ్ ప్రశంసలు

మంచు మనోజ్ తన ట్వీట్ ‌ లో రాస్తూ ..’ ప్రియమైన భూమా మౌనిక .. ఆది పరాశక్తి అంటే నువ్వే. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి పూర్తిగా మారిపోయింది . టెన్షన్ ‌ లో ఉన్నప్పుడు నీ మౌనం, కష్టాల్లో కూడా నీ దయ, ప్రజల పట్ల, నిన్ను బాధపెట్టే వారి పట్ల కూడా నీ అచంచలమైన కరుణ మాయాజాలాన్ని నేను చూశాను. ఆ బలం , స్వచ్ఛత నన్ను విస్మయంతో తల వంచేలా చేస్తాయి ఎప్పటికీ. నా భార్యగా ప్రేమను పంచావు . ధైరవ్ , దేవసేన .. లిటిల్ జోయాకు తల్లిగా .. నువ్వు వారి ప్రతి అడుగును నడిపించే వెలుగుగా మారావ్ . మా ఇంటిని నవ్వులతో నింపేశావ్ . నమస్తే వరల్డ్ సీఈవో , వ్యవస్థాపకురాలిగా ఏమి సాధించగలదో నువ్వు చూపించావు. రాయలసీమ బిడ్డగా .. ప్రజలకు నీ నిరంతర సేవ నిన్ను నాయకురాలిగా మాత్రమే కాకుండా లెక్కలేనన్ని జీవితాలకు ప్రేరణగా నిలుస్తుందని ‘ కొనియాడారు .

వైరల్ అవుతున్న పుట్టినరోజు వీడియో

నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ దురాశ పడలేదు .. ఎప్పుడూ నీ కష్టాన్ని నమ్ముకున్నావు .. నీ ఆత్మగౌరవం నన్ను నేను మరింత గౌరవించుకునేలా చేసిందని మంచు మనోజ్ ట్వీట్ ‌ చేశారు . నీ వల్లే నేను ఈ రోజు మెరుగైన వ్యక్తిగా మారాను . . నాపై అలాగే రాబోయే మన అందమైన ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నీ సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది .. నీ ధైర్యం నాకు స్ఫూర్తినిస్తూనే ఉందంటూ మనోజ్ రాసుకొచ్చాడు . నా జీవితాన్నే మార్చేసిన నా ప్రేమ, నా భాగస్వామి, నా బలం, నా శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు .. నీ వల్లే ఈ ప్రపంచం, పిల్లలు నా లైఫ్ ‌ లో దక్కిన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు .

మొత్తానికి, మంచు మనోజ్ తన సతీమణి పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని ఈ పుట్టినరోజు శుభాకాంక్షలతో స్పష్టంగా తెలియజేశారు. ఈ హృదయపూర్వక సందేశం, వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.