|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సాయం చేయాలంటూ ‘మంచు మనోజ్‌’ ట్వీట్‌

Published: 08-06-2025, 10:44 PM
సాయం చేయాలంటూ 'మంచు మనోజ్‌' ట్వీట్‌

తెలుగు హీరో మంచు మనోజ్ తాజాగా ఒక చిన్నారికి సాయం చేయాలని ట్వీట్ చేశారు. రెండు రోజుల చిన్నారి ప్రాణాలను కాపాడటానికి 10 లక్షలు అవసరమని ఆయన తెలిపారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

మంచు మనోజ్ రెండురోజుల చిన్నారికి సాయం చేయాలని ట్వీట్ చేశారు.

2

ఆ చిన్నారికి చికిత్సకు రూ.10 లక్షలు అవసరమని తెలిపారు.

4

కొందరు నెటిజన్లు సాయం చేయడం లేదని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మనోజ్ ట్వీట్ వైరల్

భైరవం సినిమాతో చాలా విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చారు మంచు మనోజ్‌.. తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మూవీతో మెప్పించారు. అయితే, తాజాగా రెండురోజుల ఒక చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు సాయం చేయాలంటూ మనోజ్‌ ఒక పోస్ట్‌ చేశారు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న దానిని చూసిన అభిమానులు, నెటిజన్లు తోచినంత సాయం చేస్తున్నారు. మంచు మనోజ్‌ కొంత కాలంగా ఆస్తుల పంపకాల విషయంలో తన కుటుంబంతో ఫైట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

చిన్నారికి 10 లక్షలు అవసరం

సాయం చేయాలంటూ మంచు మనోజ్‌ ఇలా ట్వీట్‌ చేశారు. ‘ రెండురోజుల చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతుంది. పుట్టకతోనే ఇలాంటి కష్టాలు పడుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే చాలాబాధేస్తుంది. ఆ చిన్నారిని రక్షించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం పోరాడుతుంది. కానీ, ఆమెను కాపాడటానికి రూ.10 లక్షలు అవసరం. అది వారికి చాలా పెద్ద మొత్తం. మీ వంతు సాయం చేయండి. అది ఎంతైనా కావచ్చు ఒక ప్రాణం నిలబడుతుంది. నేను నా వంతు సాయం చేశాను.  ఈ చిన్నారిని కాపాడటానికి మనందరం కలిసి సాయం చేద్దాం. ప్రతి సాయం కూడా విలువైనదే.’ అంటూ  ఆ చిన్నారి కుటుంబ సభ్యుల బ్యాంక్‌  ఖాతాను షేర్‌ చేశారు.

భిన్నాభిప్రాయాలు

అయితే, చాలామంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ, వారి బ్యాంక్‌ వర్క్‌ చేయడం లేదని కొందరు స్క్రీన్‌ షాట్స్‌ పంపడంతో.. మంచు మనోజ్‌ మరోక బ్యాంక్‌ ఖాతా నంబర్‌ను షేర్‌ చేశారు. అయితే, ఈ విషయంలో కొందరు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రూ. 10 లక్షలు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా అన్నా అంటూ అభిమానులు కూడా కామెంట్‌ చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం మనోజ్‌ను మెచ్చుకుంటూ సాయం చేయడంలో తామందరినీ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం అంటూ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మనోజ్‌ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తెలుసుకోగలరు.

చిన్నారికి సహాయం చేయాలని మనోజ్ చేసిన ట్వీట్‌కు అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. కానీ, ఈ విషయంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తంమీద మనోజ్ ప్రయత్నం అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.