
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్‌రావు కుటుంబాన్ని సినీనటుడు మంచు విష్ణు పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Key Points
మంచు విష్ణు పహల్గాం దాడిలో మరణించిన మధుసూదన్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు.
కావలిలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మధుసూదన్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దాడి వివరాలను కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.
మంచు విష్ణు కుటుంబాన్ని పరామర్శించారు
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులను మా అధ్యక్షులు, సినీ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలోని వారి ఇంటికి చేరుకున్న విష్ణు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం.. దాడి జరిగిన తీరును మధుసూధన్ సతీమణి కామాక్షి, పిల్లలను అడిగి విష్ణు తెలుసుకున్నారు. కావలి తమ అమ్మగారి ఊరు కావడంతో ఆ ప్రాంతంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.
తాను మాట్లాడాలనుకున్నది వారితో మాట్లాడానని విష్ణు అన్నారు. మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులకు ఎలాంటి భరోసా ఇచ్చాను అనేది తమ పర్సనల్ అని అన్నారు. ప్రస్తుతం తాను మీడియాతో పెద్దగా మాట్లాడలేనని చెప్పి.. ఈ విషయంలో తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దంటూ అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. వారిలో కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా ఉన్నారు.
ధైర్యం చెప్పి ఓదార్చారు
నివాళులర్పించి మీడియాతో మాట్లాడలేదు
మంచు విష్ణు తన పరామర్శతో కుటుంబానికి మానసికంగా బలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ఘటనపై తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.


