|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Vishnu: సంచలనంగా మారిన మంచు విష్ణు కామెంట్స్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Published: 23-06-2025, 9:44 AM
Manchu Vishnu: సంచలనంగా మారిన మంచు విష్ణు కామెంట్స్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆయన హిందూ మతం, భార్య క్రైస్తవ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

Key Points

1

మంచు విష్ణు "కన్నప్ప" సినిమా ప్రమోషన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2

ఆయన హార్డ్‌కోర్ హిందూ అని, భార్య క్రైస్తవురాలు అని తెలిపారు.

4

బైబిల్ గురించిన ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

కన్నప్ప సినిమా ప్రమోషన్స్

డైనమిక్ హీరో మంచు విష్ణు(manchu vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’(Kannappa). షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. కన్నప్ప కూడా నా పరంగా అలాంటి మూవీనే. అలాగే నేను హార్డ్ కోర్ హిందువుని. నా భార్య క్రిస్టియన్. ఆమె రోజు మా ఇంట్లో బైబిల్ చదువుతుంది.

అంతేకాకుండా నేను నిద్రపోయేటప్పుడు నా తలగడ కింద బైబిల్ ఉంచుతుంది. నాలోని ఏవైనా దుష్టశక్తులు ఉంటే వెళ్లిపోతాయని ఆమె నమ్మకం. దేవుడు అన్నిచోట్ల ఉంటాడు. కాకపోతే గుడికి వెళ్తేనే మనశ్శాంతి దొరుకుతుందని అంతా నమ్ముతారు. కన్నప్ప సినిమాలో క్లైమాక్స్ ఒక్కటే అయినా అంతకు ముందు సన్నివేశాలను మాత్రం ఎవరికి వాళ్ల ఊహలకు తగ్గట్లు తెరకెక్కించారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తు్న్నారు. బూతులు తిడుతూ మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు.హార్డ్ కోర్ హిందువు అయితే నెత్తికింద బైబిల్ ఎలా పెట్టుకున్నావుగా గొర్రె అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘కన్నప్ప’ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు

దారుణమైన ట్రోలింగ్

మంచు విష్ణు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. నెటిజన్ల ట్రోలింగ్ తో ఈ విషయం మరింత చర్చనీయాంశమైంది. సినిమా విడుదల తర్వాత ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.