|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా జీవితంలో ప్రభాస్‌ కృష్ణుడు.. కర్ణుడిలా ఆయన వెంట ఉంటా : మంచు విష్ణు

Published: 22-06-2025, 12:11 AM
నా జీవితంలో ప్రభాస్‌ కృష్ణుడు.. కర్ణుడిలా ఆయన వెంట ఉంటా : మంచు విష్ణు

‘కన్నప్ప’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మంచు విష్ణు, ప్రభాస్ తో తన అనుబంధాన్ని గురించి మాట్లాడారు. ప్రభాస్ తో తనకున్న బంధాన్ని కృష్ణుడు-కర్ణుడితో పోల్చారు. సినిమా విజయం కోసం ఆశీస్సులు కోరారు.

Key Points

1

మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

2

ప్రభాస్‌తో తన స్నేహం గురించి విష్ణు ఎమోషనల్‌గా మాట్లాడారు.

4

సినిమా విజయం కోసం మంచు మోహన్ బాబు ఆశీస్సులు కోరారు.

‘కన్నప్ప’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్

‘‘కన్నప్ప’ సినిమా ఆ భగవంతుని ఆశీస్సులు. మన చేతుల్లో ఏదీ ఉండదు అనడానికి ఉదాహరణే ఈ చిత్రం. రెండు సినిమాలు హిట్‌ అవగానే మనం గొప్పవాళ్లమని అనుకుంటాం. కానీ, మనం కేవలం వస్తువులమే. ఆ భగవంతుడు, తల్లిదండ్రుల ఆశీస్సులే ముందుకు నడిపిస్తాయి’’ అని మంచు మోహన్‌ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా నటించిన  పాన్‌ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్‌  హీరోయిన్‌.. మంచు మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్, మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మోహన్‌ బాబు మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’లో అందరూ హీరోలే. ఈ చిత్రంలో నటించిన నటీనటుల సహాయ, సహకారాలు మరువలేనివి. కన్నప్పగా తిన్నడు ఎలా మారాడు? పరమేశ్వరుడికి కళ్లు ఎలా ఇచ్చాడు? అన్నది ఈ చిత్రకథ. శ్రీ కాళహస్తీశ్వరుడి కరుణ, కటాక్షాలతో ‘కన్నప్ప’ సక్సెస్‌ అవ్వాలి. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మంచు విష్ణు, ప్రభాస్ స్నేహం

మంచు విష్ణు(Manchu Vishnu) మాట్లాడుతూ– ‘‘ఇది నా సినిమా కాదు… కన్నప్ప సినిమా. ఎడిటింగ్‌లో సినిమా చూసిననప్పుడు.. ‘వావ్‌.. ఇంత పెద్ద సినిమానా? మేము చేయగలిగామా? నేను నటించానా?’ అనిపించింది. ఈ సినిమాలో చాలామంది హీరోలున్నారు. నటించినవారు, డైరెక్టర్, మ్యూజిక్‌ డైరెక్టర్, ఎడిటర్‌… అందరూ హీరోలే. నేను పని చేసిన బెస్ట్‌ దర్శకుల్లో ముఖేష్‌ కుమార్‌గారు ఒకరు. శివుడి అనుగ్రహం వల్లే ఇంత పెద్ద సినిమా తీయగలిగానని శివ రాజ్‌కుమార్‌గారితో అన్నాను. ‘కన్నప్ప’ సినిమా చేయాల్సిన అవసరం ప్రభాస్‌కి లేదు. కానీ, నాన్నగారిపైన ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఒప్పుకున్నారు. కొంచెం డబ్బు, పేరు రాగానే మనుషులు మారిపోతుంటారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని పెద్ద నటుల్లో ప్రభాస్‌(Prabhas) ఒకరు… కానీ, మేమిద్దరం కలిసిన మొదటి రోజు నుంచీ ఈరోజు వరకు కూడా అలాగే ఉన్నాం. నా జీవితంలో ప్రభాస్‌ కృష్ణుడు అయితే… తన జీవితంలో నేను కర్ణుడిని. ఈ సినిమాకి ఏది సాధ్యమైంది అన్నా అది నా దేవుడైన నాన్నగారి వల్లే. ‘కన్నప్ప’ని ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’ సినిమాని ఆదరించండి… అభిమానించండి… అల్లరి మాత్రం చేయకండి. ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా, ప్రతి గుండెలోకి, ప్రతివాళ్ల మనసులోకి చేరాలి’’ అన్నారు.

సినిమా విజయం కోసం ఆశీస్సులు

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ– ‘‘మోహన్‌ బాబుగారు నన్ను నమ్మడం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. తెలుగు భాష కూడా తెలియని నన్ను నమ్మి, టాలీవుడ్‌కి తీసుకురావడం, గొప్ప ప్రాజెక్ట్‌ ఇవ్వడమంటే ఆయన ధైర్యం, నమ్మకమే. నేను పని చేసిన నటుల్లో విష్ణు మంచు మోస్ట్‌ ప్రిపేర్డ్‌ యాక్టర్‌. ప్రభాస్‌గారు మీకు రెబల్‌స్టార్‌. కానీ, నాకు తెలిసి ఆయన హంబుల్‌ స్టార్‌. సింపుల్‌గా ఉంటారు’’ అన్నారు.

మొత్తం మీద, ‘కన్నప్ప’ సినిమా విడుదలకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ మరియు మంచు విష్ణుల స్నేహం సినిమాకు మరింత ఆకర్షణను తీసుకొస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.